Mamata Banerjee: ఇలా చేయకపోతే మిమ్మల్ని నిర్బంధ శిబిరాలకు తరలిస్తారు.. ఇది షేమ్.. షేమ్..: మమత

‘‘ఓటర్ జాబితాతో మీ పేరు ఉండలా చూసుకోండి.. లేదంటే, ఎన్సార్సీ పేరిట మిమ్మల్ని నిర్బంధ శిబిరాలకు తరలిస్తారు. ఇది షేమ్.. షేమ్.. షేమ్..’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గతంలో రైల్వే, విమానయాన సంస్థలు బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.

Mamata Banerjee: జాతీయ పౌర పట్టిక(ఎన్సార్సీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్సార్సీలో పేరు ఉండాలంటే ఓ పని చేయాలని ప్రజలకు సూచించారు. పశ్చిమ బెంగాల్ లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ఓటర్ జాబితాతో మీ పేరు ఉండలా చూసుకోండి.. లేదంటే, ఎన్సార్సీ పేరిట మిమ్మల్ని నిర్బంధ శిబిరాలకు తరలిస్తారు. ఇది షేమ్.. షేమ్.. షేమ్..’’ అని వ్యాఖ్యానించారు.

గతంలో రైల్వే, విమానయాన సంస్థలు బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయని మమతా బెనర్జీ అన్నారు. ‘‘సరైన పరిహారం ఇవ్వకుండా, పునరావాస చర్యలు చేపట్టకుండా బెంగాల్ లో ఇటువంటి చర్యలకు పాల్పడితే వాటిని కొనసాగనివ్వం’’ అని చెప్పారు.

బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నాలు జరిపితే దానిపై పోరాటం చేయాలని, నిరసనకారులకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని అన్నారు. 100 రోజుల ఉపాధి హామీ పథక నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదని చెప్పారు. బీజేపీ ఆదేశాల అనుసారమే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు