Lockdown Time:లాక్‌డౌన్ టైంలో లేజీగా ఉండొద్దు. మంచి డ్రెస్ వేసుకోవడం ముఖ్యమే. ఎందుకంటే… ఈ 11 కారణాలు!
మోడీవచ్చారు...లాక్‌డౌన్ పెంచారు. కరోనా తగ్గేవరకు మనకు ఈ ఇంట్లోనే ఉండటం తప్పదేమో! మనలో చాలామంది నిజంగా ఆఫీసులు మిస్ అవుతున్నాం. ఫ్రెండ్స్‌తో కలవడం....ఆఫీసు అయిన తర్వాత జాలీగా... నచ

LockDFown Time:మోడీవచ్చారు…లాక్‌డౌన్ పెంచారు. కరోనా తగ్గేవరకు మనకు ఈ ఇంట్లోనే ఉండటం తప్పదేమో! మనలో చాలామంది నిజంగా ఆఫీసులు మిస్ అవుతున్నాం. ఫ్రెండ్స్‌తో కలవడం….ఆఫీసు అయిన తర్వాత జాలీగా… నచ్చినవాళ్లను కలవడం. ఇప్పుడు మహమ్మారి కారణంతో Social distance మనల్ని మానసికంగా
దెబ్బతీస్తోంది.
మనం ఒకరినొకరు దూరమైనా… మనల్నినడిపిస్తోంది మాత్రం మన పనే. రోజుకు పదిగంటలు పనిచేస్తున్నా… మనమింకా కాస్తంత హుషారుగా ఉన్నామంటే…వర్క్‌లో బీజీగా ఉండటమే. అలాగని, ఇంట్లో ఉన్నాం కదాని… డల్‌గా డ్రెస్ వేసుకొని ఉండనక్కర్లేదు. వర్క్‌ఫ్రమ్ హోం విషయంలో మనకీ, అమెరికా వాళ్లకి ఓ తేడా ఉంది. వాళ్లు ఇంటిదగ్గరున్నా… వర్క్‌ను సీరియస్‌గా చేస్తారు. మనం మాత్రం కాస్తంత లేజీ. ఇంటినుంచి వర్క్ అంటే మాత్రం వర్క్ సాగుతూనే ఉంటుంది. ఇక డ్రెస్అంటారా? అచ్చం ఇంట్లో ఉన్నట్లే! అలాగే ఎందుకు ఉండాలి? ఆఫీసు టైం అనుకొని…అలాగే డ్రస్ వేసుకొంటే హ్యాపీగా ఉంటామంట. ఎందుకంటే? 11 కారణాలున్నాయి….
1. ఫ్రెష్‌గా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు బైటకెళ్లలేం. ఇంట్లోనే ఉండాలి. అలాగని వర్క్ ఆగకూడదు. మీరు మిగిలినవారితో పోటీపడాలంటే ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండాలి. దానివల్ల యాటిట్యూడ్ బాగుంటుంది. మంచి డ్రెస్ వేసుకోవడమూ చాలాముఖ్యమే.
2. డ్రేస్ అంటే బట్టలు మాత్రమే కాదు. నిజానికి ఐరన్ చేసిన డ్రెస్ వేసుకొని.. మీకు నచ్చిన విధంగా మేకప్ కూడా చేసుకోవచ్చు.
3. మీ మేనేజర్స్ మీరు work from home చేస్తానంటే పెద్దగా ఇష్టపడరు. మీరు వర్క్‌ని ఈజీగా తీసుకుంటారనుకొంటారు. కొంతవరకు నిజమే. అందుకే మీరు ఉదయం 10గంటల నుంచి రోజంతా బాధ్యతగా పనిచేస్తే.. మీ బాస్ షాక్ అవుతారు.
4. మీరు మంచిగా డ్రెస్ చేసుకుని మీ మేనేజర్‌తో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడొచ్చు. ఒకవేళ మీరు మీ నైట్ డ్రెస్‌లో ఉంటే అది గౌరవంకాదు. మీ డ్రెస్సింగ్‌ని బట్టి మీరు సిన్సియర్ గా పనిచేస్తునారా లేదా అని అర్థమైపోతుంది.
5. మంచి డ్రెస్ వేసుకొంటే మీరు బాధ్యతగా కనిపిస్తారు. ఇంకా, పనిమీద దృష్టి పెట్టి పనిచేయగలుగుతారు. ముందు మీకు మీరు బాగా నచ్చుతారు.
6. మంచిగా డ్రెస్ చేసుకోవడం వల్ల మీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో… అదే ఫీల్ తో ఇంట్లో కూడా వర్క్ చేయగలుగుతారు. షెడ్యూల్ ఫాలో అవుతూ వర్క్ చేసుకుంటారు.
7. నీట్‌గా డ్రెస్ వేసుకోవడం చిన్న విషయం కాదు. చాలా అవసరం. అవి మీ మానసిక స్థితిని పెంచుతాయి. అంతేనా, వ్యక్తిత్వం , స్థితి, వయసు గురించి బట్టల్ని చూసి చెప్పొచ్చని పరిశోధనలో తేలింది.
8. ఇంకా మీరు ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం వల్ల చాలా అందంగా , తెలివిగా కనపడతారు.
9. ఒకవేళ మీరు టిండర్ యాప్‌లో ఉన్నట్లయితే. అతను లేదంటే ఆమె మీ డ్రెస్సింగ్ కచ్చితంగా చూస్తారు. నచ్చితే ఇంకా ఆ రిలేషన్ ముందుకెళ్లొచ్చు.
10. ఈ రోజులు అయిపోయేలోగా మీరు మీకు ఎలాంటి డ్రెస్సెస్ సెట్ అవుతాయో, ఎలాంటి డ్రెస్సెస్ అవ్వవో చెక్ చేసుకోండి. ఇంకా టైట్ డ్రెస్సెస్ మీకు ఎలా ఉంటాయో ట్రై చేసుకోండి.
11. మీరు ఉదయం లేచినవెంటనే బద్దకాన్నివదిలిపెట్టి, ఫ్రెష్‌గా తయారై లిప్ స్టిక్ వేసుకుని మీకు నచ్చినట్టు… మీ స్టైల్లో బతికేయండి.