Vitamin D Levels : శీతాకాలంలో మీ విటమిన్ డి స్థాయిలను పెంచడానికి అద్భుతమైన డైట్ ఇదిగో..!

Vitamin D Levels : మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా? శీతాకాలంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Vitamin D Levels : అసలే శీతాకాలం.. ఈ సీజన్‌లో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ఇందులో విటమిన్ డి లోపం కూడా ఒకటి.. ఒకవేళ మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త.. విటమిన్ డి లోపం ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. ఆ తర్వాత వైద్యుని సలహాతో అవసరమైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

అయితే, విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్.. దీనినే ఫ్యాట్ సాలిబుల్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఎముకలు, దంతాలు, కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సాయపడుతుంది.

అనేక వ్యాధుల ప్రమాదాన్ని నియంత్రించడంతో పాటు మీ మానసిక స్థితిని నియంత్రించడంలోనూ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా.. ఆహారంలో వినియోగించే కాల్షియం శోషణకు విటమిన్ డి తప్పనిసరిగా ఉండాలి. మీ ఎముకలు, దంతాలకు ఇది చాలా కీలకం కూడా.

ప్రత్యేకించి శీతాకాలంలో విటమిన్ డి అవసరమైన స్థాయిలను నిర్వహించడం కష్టమే. అందుకే.. సూర్యరశ్మి మీ శరీరంపై పడేలా చూసుకోవాలి. తద్వారా మీ శరీరమే విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. చలికాలంలో సూర్యరశ్మికి పరిమితంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ విటమిన్ డి స్థాయిలను పెంచడం చాలా ముఖ్యం. విటమిన్ డి స్థాయిలను పెంచుకోవడానికి ఏయే మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

విటమిన్ డి స్థాయిలను పెంచే మార్గాలివే :
1. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి :
మీరు ఆహారం ద్వారా విటమిన్ డి స్థాయిలను మెరుగుపరచవచ్చు. శీతాకాలంలో మీరు తినే ఆహారంలో చేర్చుకోగల కొన్ని విటమిన్ డి-రిచ్ ఫుడ్స్ ఈ కిందివిధంగా ఉన్నాయి. వీటిని మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

  • పుట్టగొడుగులు
  • సాల్మన్ చేపలు
  • గుడ్డు పచ్చసొన
  • పాలు
  • బలవర్థకమైన ఆహారాలు

2. శరీరానికి సూర్యకాంతి తగలాలి :
శీతాకాలంలో ఉదయం సమయంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి రోజుల్లో కాకుండా సూర్యరశ్మి ఉండే రోజుల్లో సూర్యరశ్మి తగిలేలా కూర్చోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు విటమిన్ డిని పొందడంలో సాయపడుతుంది. అలాగే, కఠినమైన వాతావరణం నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. చల్లని వాతావరణం కారణంగా చాలామంది బయటకు రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అందుకే, సూర్యరశ్మిని పొందడానికి ప్రతిరోజూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించండి.

4 Effective Ways To Increase Your Vitamin D Levels In Winter Season

3. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు :
అలసట, నొప్పులు, నొప్పులు, ఎముకలు, కండరాల నొప్పులు, బలహీనత, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం అనేది విటమిన్ డి లోపానికి కొన్ని సంకేతాలుగా చెప్పవచ్చు. మీరు ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు. వైద్యుని సంప్రదించి వెంటనే తగిన ట్రీట్‌మెంట్ తీసుకోండి.

4. సప్లిమెంట్లను తీసుకోండి :
మీకు విటమిన్ డి స్థాయిలు చాలా తక్కువగా ఉంటే.. మీ ఆహారంలో విటమిన్ డి సప్లిమెంట్లను తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే, ముందుగా మీ స్థాయిలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే సప్లిమెంట్లను తీసుకోవాలి. ఆహారంతో పాటు ప్రతిరోజూ సూర్యకాంతితో మాత్రమే తగినంత విటమిన్ డి స్థాయిలను పొందవచ్చు. అలాగే, మీ డాక్టర్ సూచించిన సప్లిమెంట్లను మాత్రమే తీసుకోవాలి.

గమనిక : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతుంటే.. ఈ మార్గాలను అనుసరిస్తూనే.. సరైన వైద్యుని సంప్రదించి తగిన ట్రీట్‌‌మెంట్ తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదని గమనించాలి.

ట్రెండింగ్ వార్తలు