A papaya face fake that tightens the skin and fades away the signs of aging and brightens the face!
Papaya : ముడతలు పడే చర్మం కోసం మీరు ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. పాలు, తేనె, పిండి, పసుపు మొదలైనవి కాకుండా మీరు పండ్ల నుంచి తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. బొప్పాయి ఫేస్ ప్యాక్. దీనితో ముఖంలో ముడతలు తగ్గించటంతోపాటుగా చర్మ సంబంధిత సమస్యలను వదిలించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
బొప్పాయి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. కొద్దిగా పండిన బొప్పాయిని ఒక గిన్నెలో వేసి ఇందులో అర టీ స్పూన్ బాదం నూనెను మిక్స్ చేసి పొడి చర్మంపై అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి.
రోజువారీ అలవాటుగా బొప్పాయి గుజ్జు, ఒక అర స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్ అన్నీ కలిపి ముఖం, మెడకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. పార్టీకి, ఫంక్షన్‌కి వెళ్లేముందు బొప్పాయి గుజ్జు, కొన్నిచుక్కల రోజ్ వాటర్ కలిపి ఒక మాస్క్‌లాగా వేసుకోవటం వల్ల ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది.
పండిన బొప్పాయి, పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 5-10 నిమిషాల తర్వాత మఖాన్ని కడిగేయండి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
బొప్పాయి గుజ్జులో పచ్చిపాలను వేసి బాగా మిక్స్ చేసి ముకాని పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తెల్లగా అవుతుంది. బొప్పాయి గుజ్జులో గుడ్డు తెల్లసొన వేసి ఫేస్ మాస్క్ లా వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే, చర్మం బిగుతుగా మారుతుంది. బొప్పాయి ఫేస్ ప్యాక్ వల్ల వృద్దాప్య లక్షణాలు తొలగిపోతాయి. చర్మంకు కావల్సినంత తేమను అందుతుంది.