Nasal Congestion : ముక్కు దిబ్బడ వదిలించే వాము..

స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాము , మెంతులను వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Carom Seeds (1)

Nasal Congestion : ఇంట్లోనే అందుబాటులో ఉండే మంచి మెడిసిన్ గా వామును చెప్పవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే దివ్వమైన ఔషదంగా వామును ఆయుర్వేదంలో పేర్కొంటారు. పలు ఔషదాల తయారీలోను దీనిని వినియోగిస్తారు. వాముతో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి సమస్యలను తగ్గించటంలో వాము బాగా పనిచేస్తుంది. వాము, బెల్లాన్ని నమిలి తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది.

వాముని కొద్దిగా తీసుకుని మెత్తగా దంచి పలుచటి గుడ్డలో ఒంటి పొర మీద మూటగట్టి గట్టిగా వాసన పీల్చండి. పదే పదే ఇలా పీలుస్తుంటే తుమ్ములు, ముక్కు దిబ్బడ , జలుబు భారం తగ్గుతాయి. తలనొప్పి నెమ్మదిస్తుంది. ఇన్ హేలర్ల వాడకం మంచిది కాదు, అతిగా వాడితే నెత్తురు కారడం ముక్కు లోపలి పొరల్లో ఇరిటేషన్ రావడం జరుగుతోంది. వాము పొడితో వాసన పీల్చడం సున్నితంగా ఉంటుంది.

స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాము , మెంతులను వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం నుంచి ఉపశమనం లభిస్తుంది.

అంతేకాకుండా గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడిన సమస్యలను, గొంతు నొప్పులను వెంటనే తగ్గించడానికి వాము చక్కగా పనిచేస్తుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిలో ఉప్పు కలుపుకుని ఈ నీటితో నోరు పుక్కిలించడం చేయాలి. ఈవిధంగా చేస్తే గొంతునొప్పి త్వరగా పోతుంది.