Medicinal plants : మన చుట్టూ ఉండే ఔషధాల మొక్కలు..ఆరోగ్యాల సిరులు..

భూమి మీద మనిషి కంటే ముందే పుట్టిన ఎన్నో రకాల మొక్కలు మానవుడికి ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే ఆరోగ్యాల సిరులే. అటువంటి ఔషధ మొక్కల్ని ఇంటిలోనే పెంచుకోటం ఎలాగో..వాటి ప్రయోజనాలేంటో..

medicinal plants benefits  : భూమి మీద మనిషి కంటే ముందే పుట్టిన ఎన్నో రకాల మొక్కలు మానవుడికి ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే సిరులే. కానీ వాటిని మనం గుర్తించం. మనం రోజు వాటిని చూస్తుంటాం. కానీ అవి మనకు ఆరోగ్యాలనిస్తాయనే విషయం తెలియదు. చిన్న చిన్న అనారోగ్యం వస్తే గబగబా డాక్టర్ వద్దకు పరుగెడతాం. ఫీజులు ఇచ్చి పరీక్షలు చేయించుకుని వారు రాసిన మాత్రలు మింగుతాం.ఇంజెక్షన్లు చేయించుకుంటాం. డాక్టర్ వద్దకు వెళ్లటం మంచిదే.కానీ చిన్న చిన్నవాటికి కూడా వెళ్లటం వల్ల సమయం..డబ్బు వృథా. అందుకే ప్రకతి మనిషికి ఇచ్చిన ఎన్నో రకాల ఔషధాల మొక్కల్ని మనం గుర్తించటంలేదు. వాటి గురించి మరచిపోతున్నాం కూడా. మన పూర్వీకులు. మన పెద్దలు ఆస్పత్రులకు వెళ్లకుండానే ఎన్నో రోగాలను నయం చేసుకున్నారనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి.మన చుట్టూ ఉన్న ఔషధాల మొక్కల గురించి తెలుసుకోవాలి. వాటిని డబ్బులు పెట్టి కొననక్కరలేదు.మన చుట్టూనే ఉంటాయి. వాటిని తెచ్చుకుని మనం ఇంటిలోనే పెంచుకోవచ్చు..అటువంటి ఔషధాల మొక్కల గురించి తెలుసుకుందాం..

ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది చిన్న చిన్న అనారోగ్యాలకు చికిత్స కోసం ఇప్పటికీ సంప్రదాయ మూలికలపైనే ఆధారపడుతున్నారు. ఇంటి తోటలో వీటిని పెంచడం వల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి సృజనాత్మకమైన సంతృప్తి. మరోటి ఇంట్లో సంప్రదాయ వ్యాధుల చికిత్స. ఈసారి హోం గార్డెనింగ్‌లో భాగంగా ఇంటి తోటలోనే పెంచే ఔషధ మొక్కల గురించి తెలుసుకొని, వాటి పెంపకాన్ని ఆచరణలో పెట్టేయండి. ఈ మొక్కలకు ఎలాంటి మట్టి కావాలి, ఎంత నీరు పోయాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలను కూడా తెలుసుకోండి.

ఎన్నో ఉపయోగాల అలోవెరా..అందాన్ని పెంచే అలోవెరా..
కలబంద. దీని గుజ్జు ఎంతగా ఉపయోగమో తెలిస్తే అస్సలు వదలం. శరీరంపై దీర్ఘకాలికంగా ఉన్న మొండి మచ్చల్ని కూడా రూపుమాపేస్తుంది అలోవెరా గుజ్జు రాసుకుంటే. అనేక వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంతి కలబంద. కలబంద రసం చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచుతుంది. మొటిమలకు చక్కటి పరిష్కారం కలబంద. అంతేకాదు ప్రతీరోజు అంగుళం పొడవుకున్న అలోవెరా ముక్క తింటే జీర్ణకోశ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది.

దోమలు కుట్టి దద్దుర్లు వచ్చినా..ఇంకా ఇతర కీటకాల కాటుకు వచ్చే నొప్పి, మంటను తగ్గిస్తుంది. కలబందను కుండీలలో పెంచుకోవచ్చు. దీనికి సూర్యకాంతి తగిలితే భలేఏపుగా పెరుగుతుంది. పెద్దగా నీరు పోయాల్సినపనికూడా ఉండదు.చిన్న మొక్క తెచ్చుకుని కుండీలో నాటుకుంటే అత్యంత వేగంగా పెరిగిపోయి చిన్న చిన్న పిలకలు వచ్చి కుండీ అంతా నిండిపోతుంది. నాటుకుంటే ఆరోగ్యాల సిరుల్ని ఇచ్చే మొక్కల్లో అలోవెరాది చాలా ప్రత్యేక స్థానం అని చెప్పాల్సిందే.

తిప్పతీగ..
తిప్పతీగ.ఔషధాల ఘని అనే చెప్పాలి. కరోనా కాలంలో ఆనందయ్య మందులో అత్యంత కీలకంగా ఉన్నది ఈ తిప్పతీగ. గిలోయ్‌ అనే ఈ తీగ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాలేయం, మూత్రపిండాల సమస్యలను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, మధుమేహానికి ఉపయోగపడుతుంది. దీనికి అమితమై శ్రద్ధ అవసరం లేదు. పెద్ద కుండీల్లో లేదా కుండలో మట్టి పోసి, నాటితే చాలు. సులభంగా పెరుగుతుంది.

కరోనా వైరస్.. ఆయుర్వేద అంశాలను ఎన్నింటినో వెలుగులోకి తెచ్చింది తిప్పతీగ. వైరస్ ప్రభావంతో ప్రతి ఇల్లూ ఒక ఆయుర్వేద వైద్యశాలగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. దీనిలో ఉన్న ఔషధ గుణాలు అంటువ్యాధులను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ప్రతి రోజు రెండు ఆకులు తినడం అలవాటు చేసుకుంటే క్రమేపీ కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

తిప్పతీగ ఎముకల్లో ఖనిజ శక్తిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎముకల వ్యాధులను నివారిస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను నిర్వీర్యం చేయడానికి కాలేయానికి మద్దతు ఇస్తుంది. తిప్పతీగలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. తత్పలితంగా హృదయ కండరాల పని తీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో కూడా ఫైట్ చేయగలవు.

శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా ఉండడానికి ఎంతో బాగా తిప్పతీగ సహాయం చేస్తుదని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు అయిన డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. అలానే తిప్పతీగ వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయంటున్నారు నిపుణులు. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కూడా తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా తిప్పతీగ ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ని ఇది త్వరగా పోగొడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా తగ్గిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారికి మంచిగా ఉపశమనం లభిస్తుంది.

 

నిమ్మగడ్డి
యాంటీబ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, తలనొప్పి సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ మెరుగుకు సహాయపడుతుంది. నిమ్మగడ్డితో టీ తయారు చేసుకుని ప్రతీరోజు తాగితే శరీరంలో ఉండే అధిక కొవ్వు కరిగిపోతుంది.తద్వారా బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్నవారు నిమ్మగడ్డితో తయారు చేసిన టీ తాగితే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

ఈ గడ్డి మొక్కను వెడల్పాటి కుండీలలో పెంచుకోవచ్చు. దీనికి నీళ్లు ఎక్కువ అవసరం. కుండీ మట్టిపై భాగంలో ఇసుక పోయాలి. అప్పుడు అదనంగా నీళ్లు ఉన్నా త్వరగా ఇంకిపోతాయి.

సరస్వతి ఆకు
హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్నికూడా ప్రసాదిస్తుందట. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఆ ఆకుతో చేసిన లేహ్యం తింటే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అందుకే విద్యార్దులకు సరస్వతి ఆకుతో చేసిన మిశ్రమాలను పెడుతుంటారు.

మండుకాపర్ణి, బ్రాహ్మి మొక్కగానూ పేరున్న సరస్వతి ఆకు అధిక ఒత్తిడి, అధిక రక్తపోటు, ఇతర మానసిక వ్యాధులను నయం చేయడానికి తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ మొక్కకు ఒక భాగం మట్టి, ఒక భాగం ఇసుక, రెండు భాగాలు సేంద్రీయ ఎరువుల మిశ్రమం ఉండాలి. రోజూ నీళ్లు పోయాలి. మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. మేధా శక్తిని పెంచటంలో పేరుకు తగినట్లే అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు రకాన్నిశుద్దీకరిస్తుంది.

అత్యద్భుతాల అశ్వగంధ
అశ్వగంధ. పేరు ఎంత మధురంగా ఉంటుందో ఉపయోగాలు కూడా అలాగే ఉంటాయి. అశ్వగంధ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక వ్యాధులకు ప్రయోజనకారి. ఈ మొక్కలో ఆకులు, కాండం, వేళ్లు కూడా ఉపయోగాలే. కుండీలలో కూడా దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఎక్కువ నీళ్లు పోయాల్సిన పనిలేదు.

వర్షాకాలం అసలే జలుబు కాలం. రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చేకాలం. దగ్గు, తుమ్ములు, కరోనా కాలం కూడా కావడం తో ఈ తరహా అనారోగ్యం మనల్ని భయపెడుతుంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించే ప్రకృతి ఔషధ వరాలు గల మొక్కలు మన ఇంట్లోనే ఉంటే ఆందోళన కొంత తగ్గుతుంది. ఇవే కాకుండా తులసి, పుదీనా, అతిబల,మెంతి వంటివి ఎన్నో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు