Sonam Kapoor Pregnancy Diet : పండంటి పాపాయి కోసం కాబోయే అమ్మలకు బాలివుడ్ ముద్దుగుమ్మ సోనమ్‌ సలహాలు..!

బాలివుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ తల్లి అయిన ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తోంది. ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డతో మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. తనలాగా అందరు మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షిస్తోంది. అందుకే కాబోయే అమ్మలు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇన్ స్టా వేదికగా సలహాలిచ్చింది సోనమ్.

Actress Sonam Kapoor Shares Her Pregnancy Diet..

Sonam Kapoor Pregnancy Diet : బాలివుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ తల్లి అయిన ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తోంది. ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డతో మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. తనలాగా అందరు మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదించాలని ఆకాంక్షిస్తోంది. అందుకే కాబోయే అమ్మలు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇన్ స్టా వేదికగా సలహాలిచ్చింది సోనమ్. గర్భం ధరిస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? అనే సందేహాలు చాలానేఉంటాయి. అటువంటివారికి సోనమ్ ఇచ్చే సలహాలు చక్కటి చిట్కాలనే చెప్పాలి. అవితినకూడదు..ఇవి తినకూడదని ఎన్నో ఆంక్షలుంటాయి గర్భిణులకు. కానీ అవన్నీ కేవలం అపోహలేనని..బిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతోంది సోనమ్ కపూర్. 2022 ఆగస్టులో తల్లైన సోనమ్ తాను గర్భిణిగా ఉన్న సమయంలో పాటించిన ఆహార నియమాలు, తీసుకున్న జాగ్రత్తల గురించి తాజాగా ఇన్‌స్టా రీల్స్‌ రూపంలో పంచుకున్నారు. ఈ ఇన్ స్టా సలహాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి సోనమ్ సలహాలేంటో చూసేద్దాం..

సెలబ్రిటీ కిడ్‌ అయినా తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకోవడానికి అస్సలు వెనకాడదు సోనమ్‌. ఈ క్రమంలోనే తాను గర్భిణిగా ఉన్న సమయంలో దిగిన ఫొటోల్ని, తన అనుభవాల్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకునేది. గత ఆగస్టులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ ఆ బిడ్డతోనే లోకం అన్నట్లుగా గడుపుతోంది. కెరీర్‌కు కాస్త బ్రేకిచ్చి అమ్మతనానికే తన పూర్తి సమయం కేటాయిస్తోంది. మరోవైపు గర్భిణిగా ఉన్నప్పుడు తాను పాటించిన చిట్కాల్ని షేర్‌ చేస్తూ.. కాబోయే తల్లుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. అలా తన ప్రెగ్నెన్సీ డైట్‌, ఆ సమయంలో పాటించిన సౌందర్య చిట్కాల గురించి ఇలా పంచుకుందీ కపూర్‌ బ్యూటీ.

బిడ్డ ఎదుగుదలకు ఇవి బెస్ట్ అంటున్న సోనమ్..

కడుపులోని బిడ్డ ఎదుగుదలకు సంపూర్ణ పోషకాహారం తప్పనిసరి! అందుకే ఇవి పుష్కలంగా నిండి ఉన్న పండ్లు, కాయగూరలనే తరచూ ఆహారంలో భాగం చేసుకునేదాన్ని.

విటమిన్‌ ‘ఎ’, పొటాషియం నిండి ఉన్న క్యారట్లు, చిలగడదుంప, ఆకుపచ్చటి కాయగూరలు, ఆకుకూరలు, గుమ్మడి, టొమాటో, క్యాప్సికం.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

అరటి, ఆప్రికాట్స్‌, కమలాఫలం, ద్రాక్ష, ఎండు ద్రాక్ష.. వంటి ఫలాలతో పాటు ఆయా కాలాల్లో దొరికే పండ్లనూ మెనూలో చేర్చుకోవాలి.

వెన్న లేని పెరుగు, ఓట్‌ మిల్క్‌, సోయా పాలు, కొబ్బరి పాలు, మజ్జిగ, పనీర్‌.. వంటి పాల పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత ప్రొటీన్‌ అందుతుంది.

ఐరన్‌, ఫోలికామ్లం వంటి సప్లిమెంట్లను గర్భం ధరించిన మొదటి నెల నుంచే వాడడం మొదలుపెడతాం. అయితే వీటితో పాటు ఈ పోషకాలు ఎక్కువగా లభించే సెరల్స్ తీసుకోవడం మంచిది.

ప్రొటీన్లు బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే బీన్స్‌, పప్పులు, ధాన్యాలు, నట్స్‌, గింజలు, చేపలు, మాంసం.. వంటివి తీసుకోవడం మంచిది.

ఆహారంతో పాటు శరీరంలో తేమ శాతం తగ్గకుండా చూసుకోవడమూ ముఖ్యమే. అందుకే బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

గర్భిణిగా ఉన్న సమయంలో పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపే పదార్థాలకు, అలవాట్లకు దూరంగా ఉండడమూ అంతే కీలకం. ఈ క్రమంలో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానని చెబుతున్న సోనమ్..పచ్చివి కంటే ఉడికించినవే బెస్ట్ అంటోంది.

సహజసిద్ధంగా పండించినవే అయినా.. ఆయా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లను ముందు శుభ్రంగా కడగడం, ఆపై ఉడికించుకొని తినడం చాలా ముఖ్యం.

గర్భిణులు పండ్లు తప్ప మిగతావేవీ పచ్చిగా తినకపోవడమే మేలు. ఎందుకంటే ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమై.. ఎదిగే బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువ.

శుద్ధి చేయని పాలు, పండ్ల రసాల్ని తీసుకోకపోవడమే ఉత్తమం.

మద్యం, ధూమపానానికి దూరంగా ఉండడంతో పాటు.. కెఫీన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, చాక్లెట్స్‌.. వంటివీ దూరం పెట్టడం మంచిది.

గర్భిణుల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అటువంటివాటిలో మలబద్ధకం కూడా ఒకటి. ఈ సమస్య రాకుండా ఏం చేసిందో సోనమ్ మాటల్లోనే.. పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, ఫైబర్‌ సప్లిమెంట్లు తీసుకోమని నిపుణులు సూచిస్తారు. ఇక నా విషయంలోనూ ఈ సమస్య తలెత్తింది. దీన్నుంచి బయటపడడానికి ఫైబర్‌ సప్లిమెంట్లు, బాదం పాలు, బెల్లం.. వంటివి తీసుకునేదాన్ని. ఇక రోజూ ఉదయాన్నే నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు, ఆపై టేబుల్‌స్పూన్‌ నెయ్యి తినడం అలవాటు చేసుకున్నానని తెలిపింది సోనమ్.

Actress Sonam Kapoor Shares Her Pregnancy Diet..

 

 

,