Corona Side Effect: కరోనా నుంచి కోలుకున్నాక ఎదురయ్యే సమస్యలు ఇవే..!

కరోనా మహమ్మారి మరోసారి తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా కరోనా ముగిసింది అని అనుకునే సమయంలో ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

Corona Side Effect: కరోనా మహమ్మారి మరోసారి తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా కరోనా ముగిసింది అని అనుకునే సమయంలో ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అయితే, కరోనా వచ్చి పోయిన తర్వాత.. అంటే కరోనా నుంచి కోలుకున్న ప్రజలు మానసికంగా చాలా బలహీనంగా మారుతున్నారని, చాలా మంది వ్యక్తుల జీవితంలో నిరాశ, నిస్సహాయత, అశాంతి వంటివి కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

కరోనా కారణంగా చాలామంది నిరుత్సాహపడటం.. జీవితం పట్ల ఉత్సాహం లేకపోవడం కనిపిస్తుందని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జీవితంలో కుంగిపోయి, వెనుకపడిపోయామనే భావన వారిలో కనిపిస్తుందని చెప్పారు. ఈ స్థితిని లాంగ్విషింగ్ అంటారని వైద్యులు చెబుతున్నారు. అంటే చేసేదేమీలేక జీవితం డల్ అయిపోయే పరిస్థితి అన్నమాట. కరోనా తర్వాత చాలా మందిలో ఎటువంటి లక్ష్యం అయినా నీరుకారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువసేపు లో-మూడ్‌లోనే కనిపిస్తున్నారు.

Ravi Teja Mother: రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే?

2020 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 78 వేర్వేరు దేశాల్లో పాల్గొనేవారి డేటాను పరిశీలించిన తర్వాత అంతర్జాతీయ అధ్యయనంలో 10శాతం మంది ప్రజలు మహమ్మారి సమయంలో తీవ్రమైన మానసిక స్థితిని అనుభవించినట్లు కనుగొన్నారు. మానసికంగా ఒత్తిడికి మనస్సుకు గాయం అవుతోందని, రొటీన్‌గా జరిగే పనుల్లో మార్పు వల్ల అనేక పనుల్లో బద్ధకం ఏర్పడుతోందని, అయితే, బద్ధకం శాశ్వతంగా ఉండదని, మానసిక స్థితిని మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా అవసరమని, కరోనా సమయంలో ముఖ్యంగా ఒంటరిగా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని, ప్రియమైన వారితో భావోద్వేగ అనుబంధం వల్ల జీవితంలోని శూన్యత దూరం అవుతుందని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు