Almonds Milk
Almond Milk : బాదంపప్పులో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. బాదం పప్పు, పాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా బాదం పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాదం పాలు తాగడం వల్ల మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. బాదంపాలలో, ఆవుపాలలో ఉన్నంత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు. బాదం మిల్క్ తాగటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదం మిల్క్ లో సోడియం తక్కువగా ఉండి హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఇందులో చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. గుండె జబ్బులు, రక్తపోటు ను తగ్గించటంలో దోహదం చేస్తాయి.
నిద్రకు ముందుగా బాదంపాలు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జ్ణాపకశక్తిని పెంచటంలో బాగా ఉపకరిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ డైట్ గా బాదం మిల్క్ ను ఉపయోగించుకోవచ్చు. బాదం పాలల లభించే కాల్షియం ఎముకుల బలన్నిస్తుంది. ఆర్ధరైటిస్, ఓస్టిరియోపోసిస్ సమస్యలు దరిచేరవు. కండరాల పెరుగుదలకు, బలానికి బాదంపాలు బెస్ట్ గా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పీచు, ప్రొటీన్లు, కాలరీలు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సాయపడతాయి.
బాదంపాలు తయారీ ; బాదంపాలు తయారీకి బాదం పప్పు అరకప్పు, పాలు: లీటరు, చక్కెర అరకప్పు, యాలకుల పొడి అర టీస్పూన్, కుంకుమపువ్వు చిటికెడు తీసుకోవాలి. బాదం పప్పును ఆరు గంటలపాటు నానబెట్టి పొట్టుతీసి కొన్ని పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి పాలుపోసి పది నిమిషాలపాటు సన్నటి మంట మీద మరిగించాలి. పాలు బాగా మరిగాక బాదం పేస్ట్, చక్కెర, యాలకుల పొడి వేసి మరో పది నిమిషాలు కలుపుతూ మరిగించాలి. చివరగా కుంకుమపువ్వు వేసి దించుకుంటే రుచికరమైన బాదంపాలు సిద్ధమౌతాయి.