Almonds :
Almonds : బాదం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. గుండె రోగులకు కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బాదం విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. బాదం పప్పుని రోజులో ఎప్పుడు అయినా కూడా తినవచ్చు. వీటిని ఎలాంటి ఫుడ్స్ లో అయినా కలిపి తీసుకోవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. బాదం చర్మ సంరక్షణకు కూడా చాలా గొప్పగా సహాయపడుతుంది.
బాదంపప్పును రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్నే తినాలి. బాదంలో జీరో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఎండు బాదం కంటే నానబెట్టిన బాదం చాలా ఎక్కువ పోషకమైనదిగా పరిగణిస్తారు. చలికాలంలో బాదం నూనెతో శరీరానికి మసాజ్ చేయడం మంచిది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. పోషకాహార లోపాన్ని నివారించుకోవడానికి ప్రతి ఒక్కరూ రోజూ బాదంపప్పును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోతుంటుంది. ఈ సమయంలో బాదం పప్పు తినడం ద్వారా శరీరం వెచ్చగా ఉంచేలా చేస్తుంది. చలికాలంలో బాదంపప్పును వేయించుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే బాదం చర్మ సంరక్షణకు గొప్పగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర ఇంకా ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మీ శరీరాన్ని తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
దీనిలోని పోషకాలు చలికాలం వచ్చే సమస్యలు,వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. మలబద్ధకం సమస్య తగ్గేందుకు ఇది మంచి ఆహారం. అల్పాహారంగా, స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. బాదం పప్పులో ఉన్న పోషకాలు చలికాలంలో వ్యాపించే వైరస్ , బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.