Increase Appetite
Increase Appetite : చలికాలంలో సహజంగానే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శీతాకాలం కనుక శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబు వంటివి బాధించడం సహజమే. ఇక ఈ కాలంలో జీవక్రియలు కూడా మందగిస్తాయి. కనుక జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. దీంతో మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఆకలి కూడా ఉండదు. ఏదీ తినాలనిపించదు.
ముఖ్యంగా ఆకలి లేకపోవడం అనేది చిన్నపిల్లలో చూస్తూనే ఉంటాము. చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. భోజనం చేయడానికి చాలా మారం చేస్తుంటారు. దాంతో పిల్లల్లో న్యూట్రీషయన్ లోపం ఏర్పడుతుంది. పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి త్వరగా తగ్గి వివిధ రకాల రుగ్మతలను ఎదుర్కోవల్సి వస్తుంది.
ఆకలి లేని పరిస్ధితుల్లో చాలా మంది వైద్యుని సంప్రదించి ఏవో టానిక్ లు వంటి వాటిని సేవించి ఆకలి పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పూర్వం నుండి ఆకలి పెంచేందుకు అనేక మంది గృహ చిట్కాలను అనుసరించే వారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఆకలి కూడా పెరుగుతుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
నిమ్మరసం జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను నివారిస్తుంది, దాంతో ఏదైనా తినాలనే కోరుక పెరుగుతుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసాన్ని పిండి, కొద్దిగా ఉప్పు లేదా కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. అలాగే కొత్తమీరను ఉడికించిన నీటిని ఒకటి లేదా రెండు టీబుల్ స్పూన్లను తీసుకోవడం ద్వారా ఆకలి కోరిక క్రమంగా రోజురోజుకు పెరుగుతుంది.
ఒక టీస్పూన్ బెల్లం పొడిలో అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. మలబద్దకం కూడా ఉండదు. సమస్యలు తగ్గేవరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.
అల్లం అజీర్తిని మరియు వికారాన్ని నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . అంతే కాదు ఇది ఆకలిని పెంచడంలో దోహదపడుతుంది. ఒక టీస్పూన్ అల్లం రసంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. 10 రోజుల పాటు ఇలా చేస్తే ఆకలి పెరుగుతుంది. కొద్దిగా నమిలి తినడం ద్వారా ఉత్తమ ఫలితం ఉంటుంది.
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఉసిరికాయ రసం, నిమ్మరసం, తేనెలను ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని బాగా కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు ఏవీ ఉండవు. ఆకలి పెంచే మరో పదార్థం ఖర్జూరం. దీన్ని నేచురల్ గా అలాగే నేరుగా తీసుకోవచ్చు. దీని వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. ఉడికించిన వెల్లుల్లి తిన్నా కూడా ఆకలి బాగా పెరుగుతుంది.
ఆకలి పెంచే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ దాల్చిన చెక్క. ఆకలి కాకుండా నియంత్రించే వికారానికి మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కను పొడి చేసి, మీరు తినే గ్రేవీలలో కలుపుకోవచ్చు. అదే విధంగా యాలుకల పొడి కూడా చక్కగా ఆకలి పెంచుతుంది. రోజూ తాగే టీలో కొద్దిగా యాలకుల పొడి కలిపి తాగుతుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. లేదా రోజు 2, 3 యాలకులను నేరుగా అలాగే నమిలి తింటుండాలి. దీంతో మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది.
ద్రాక్షలో చాలా తక్కువగా యాసిడ్స్ ఉంటాయి మరియు పుల్లని రసం ఉంటుంది . ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు దాంతో ఆకలి పెరుగుతుంది . భోజనానికి భోజనానికి మద్య తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతోపాటు వాము కూడా ఆకలిని పెంచుతుంది. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వామును వేసి మరిగించి ఆ నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అందులో నిమ్మరసం కలిపి కూడా తాగవచ్చు.