Amla Oil : జుట్టు రాలటాన్ని నివారించటంతోపాటు, పెరుగుదలకు తోడ్పడే ఉసిరికాయ నూనె!

ఉసిరి నూనెతో తలకి మసాజ్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. ఆమ్లాలో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Amla Oil Benefits

Amla Oil : ఉసిరి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉసిరి. శిరోజాలకు పోషణనిచ్చే విషయంలో ఆమ్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమ్లా లో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రత్యేకంగా ఆమ్లా నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు, తలలో దురదను నివారించడంలో సహాయపడతాయి. ఆమ్లాలో ఉండే విటమిన్ సి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి జుట్టు ఊడిపోయే సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఉసిరి నూనెతో తలకి మసాజ్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. ఆమ్లాలో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా ఉంటే జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సీజన్ తో పాటు పోషణ లభిస్తుంది. దాంతో జుట్టు ఊడిపోయే సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఉసిరి నూనెలో ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, పెక్టిన్లు, జుట్టు పెరుగుదలకు అవసరమైన శక్తిని అందించే అనేక మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఫైటోన్యూట్రియెంట్లు జుట్టు పెరుగుదలను, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఉసిరి నూనె తయారీ ;

ఉసిరి నూనెను సులభంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. అందులో కాస్తంత ఆమ్లా పౌడర్ ను యాడ్ చేయాలి. బ్రౌన్ కలర్ లోకి మారేవరకు వేచి ఉండాలి. ఈ ఆయిల్ కాస్తంత చల్లారాక జుట్టు కుదుళ్లకు రాయాలి. జుట్టు కుదుళ్ళనుంచి అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుంది.