Amla which relieves the problem of constipation in winter and speeds up digestion!
Amla : చలికాలంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసర ఉంది. ఇందుకోసం చలికాలంలో ఉసిరి అమృతం లాంటిది. దీనిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ సీజన్‌లో వచ్చే చాలా వ్యాధులకు బాగా ఉపకరిస్తుంది. ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. ఉసిరిలో పాలీఫెనాల్స్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది. మెరుగైన మెటబాలిజం నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇది శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలైన జుట్టు రాలడం, ఎసిడిటీ, బరువు పెరగడం, ఇతర సమస్యలకు చెక్‌పెడుతుంది. శీతాకాలంలో మలబద్ధకం సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఉసిరికాయ మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను బలంగా మారుస్తుంది. ఉదరం సంబంధిత అనేక సమస్యలను నివారించడంలో ఉసిరి కీలకంగా తోడ్పడుతుంది.
చలికాలంలో ఉసిరి పొడిని తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక చెంచా ఉసిరి పొడిని వేడి నీటిలో, తేనెలో కలపి తాగాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఉసిరి రసం కూడా తీసుకోవచ్చు. ఒక చెంచా ఉసిరి రసాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలపి తాగాలి. ఉసిరికాయ పచ్చడి లేదా మురబ్బా తయారు చేసుకుని తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ఉసిరికాయను చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బెల్లం పాకాన్ని కలిపి ఆమ్లా మిఠాయిని తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయను చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బెల్లం పాకాన్ని కలిపి ఆమ్లా మిఠాయిని తయారు చేసుకోవచ్చు. ఉసిరి గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంతోపాటు, కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుందని తెలుస్తుంది. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసి, డయాబెటిస్ ను నియంత్రించటంలో తోడ్పడుతుంది.