యాంటీబయాటిక్స్ వాడితే.. గర్భనిరోధక మాత్రలు పనిచేయకపోవచ్చు.. నిపుణుల హెచ్చరిక

  • Publish Date - August 19, 2020 / 01:41 PM IST

అసలే కరోనా కాలం.. కొంచెం జలుబు చేసినా ఆందోళన చెందాల్సిన పరిస్థితులివి.. జ్వరం వస్తే.. ఏ మహమ్మారి వచ్చిందోనన్న భయామే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.



యాంటీబయోటిక్స్ వాడేవారిలో మరో ఇతర మందులు సరిగా పనిచేయకపోవడం లేదని అంటున్నారు.. ప్రత్యేకించి గర్భనిరోధక మాత్రలు సరిగా పనిచేయకపోవచ్చునని నిపుణులు అంటున్నారు. మందుల దుష్ప్రభావాలకు సంబంధించి ‘ఎల్లో కార్డ్’నివేదికలపై డేటాను సేకరించారు.

యాంటీబయాటిక్స్‌ వాడే 74,623 మంది మహిళలపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు కనుగొన్నారు. 46 మంది అవాంఛిత గర్భాలను నివేదించారు. ఇతర రకాల ఔషధాలను తీసుకునే మహిళల కంటే గర్భ నిరోధక మాత్రలు తీసుకునేవారిలోనే దీని సమస్య ఎక్కువగా ఉంటుందని నివేదిక చెప్పింది. హార్మోన్ల గర్భనిరోధక మందులతో యాంటీ బాక్టీరియల్ ఔషధాలను సూచిస్తుందని తెలిపింది.



గర్భనిరోధక మందుల ప్రభావాన్ని దెబ్బతీస్తుందని గుర్తించారు. హార్మోన్ల గర్భనిరోధక మందులు తీసుకునే మహిళలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాంటీబయాటిక్స్ వంటి ఇతర ఔషధాలను తీసుకోవడాన్ని కూడా హెచ్చరిస్తున్నారు..

ట్రెండింగ్ వార్తలు