Peanuts
Peanuts : పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పల్లీల్లో ఉండే విటమిన్స్ మనం ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. ఈ గింజల్లో శరీరానికి ఎంతో అవసరమయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. పల్లీలలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల మాంసకృత్తులు, పీచు పదార్థాలు, పిండి పదార్థాల వంటి అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
పల్లీలు తినడం వల్ల మన జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. పల్లీలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో మెటబాలిజాన్ని పెంచడంలో కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి.
చర్మంపై వచ్చే ముడతలను తొలగించడంలో, చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో కూడా పల్లీలు మనకు దోహదపడతాయి. పచ్చి పల్లీలకు కొద్దిగా ఉప్పును కలిపి తినడం వల్ల చిగుళ్లు గట్టిపడతాయి. పల్లీల్లో పుష్కలంగా ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా ఉంచడంలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది.
వేరు శనగ కాయలను ఉడికించి తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది. పచ్చి పల్లీలను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. వీటిని మొలకెత్తించి తీసుకున్నా కూడా మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.
మాంసంతో పోలిస్తే పల్లీల్లోనే అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఈ పల్లీలను మితంగానే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పల్లీలను ఏవిధంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మార్కెట్ లో దొరికే
శ్వాస కోస సంబంధిత సమస్యల నుండి, ఇన్ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు, జలుబులతో బాధపడే వారు వీటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు కూడా పల్లీలను, బెల్లాన్ని కలిపి ఎదుగుదల చక్కగా ఉంటుంది.
పల్లీలతో పాటు బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల కండబలం పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పల్లీలను, బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపక శక్తి మెరుగుపర్చటంతోపాటు ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గించటంలో సహాయపడతాయి. రోజుకో గుప్పెడు నానబెట్టిన పల్లీలను, బెల్లాన్ని కలిపి తినడం వల్ల పోషకాలు శరీరానికి రోజువారిగా కావల్సినన్ని అందుతాయి.
పిల్లలకు వీటిని తరచూ ఆహారంగా ఇవ్వడం వల్ల మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగి మంచి కొవ్వులు పెరుగుతాయి.
వేయించిన పల్లీలను తినడం కంటే ఉడకబెట్టిన పల్లీలను తినడం వల్ల మనం అధిక పోషకాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. పల్లీలు మోతాదుకు మించి తీసుకుంటే కొంతమందిలో అజీర్తి తోపాటు, చర్మ సంబంధిత అలర్జీ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.