Appetite slowed down? But these Ayurvedic tips will help you increase your appetite!
Appetite : మనిషిలోని జీవకణాల శక్తికి ఆహారం అన్నది చాలా ముఖ్యమైనది. మనం తీసుకున్న ఆహారం ద్వారానే శరీరానికి శక్తి అందుతుంది. ఆహారం సరిగ్గా తీసుకోకుండా శరీరం శుష్కించి పోతుంది. అనేక రకాల జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, ప్రొటీన్లు, మినరల్స్ , విటమిన్లు ఉండేలా చూసుకోవాలని నిపుణులు ఇస్తున్న సలహా.
అదే క్రమంలో చాలా మందికి ఆకలి లేకపోవటం అన్నది పెద్ద సమస్యగా ఉంటుంది. అలాగని ఆకలి అధికంగా ఉండటం కూడా లోపమే అవుతుంది. ఆకలి లేకపోవటం వల్ల ఆహారం తీసుకోరు. ఇలా తీసుకోకుండా ఉండటం వల్ల శరీరంలోని శక్తి స్ధాయిలు క్రమేపి క్షీణిస్తాయి. ముఖ్యంగా చదువుకునే వయస్సున పిల్లల్లో ఆకలి లేకపోవటం అన్నది కొందరిలో సహజంగానే ఉంటుంది. అలాంటి వారికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఆకలిని పెంచటంలో సహాయపడతాయి. అవేంటో చూద్దాం…
ఆకలి పెరగటం కోసం ;
1. ఆకలి మందగిస్తే రెండు స్పూన్ల తేనె, అల్లం రసం ఒక స్పూను కలిపి పరగడుపున తీసుకోవాలి. దీంతో ఆకలి పెరుగుతుంది.
2. ద్రాక్ష, పంచదార, తేనె సమభాగాలుగా తీసుకుని మెత్తగా చేయాలి. దీనిని రోజు కొద్ది మోతాదులో రోజు ఉదయం తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణమవుతుంది.
3. అజీర్ణ సమస్యతో బాధపడుతున్న వారు శొంటి ఒక భాగం, మిరియాలు రెండు భాగాలు, పిప్పళ్లు లేదంటే వాబు మూడు బాగాలు తీసుకుని కొంచెం వేయించుకోవాలి. దానికి కొద్దిగా సైంధవ లవణం కలుపుకోవాలి. దానిని రోజు ఉదయం , సాయంత్రం మజ్జిగలో తీసుకోవాలి.
4. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. లేదంటే చిన్న అల్లం ముక్కను నేరుగా అలాగే నమిలి మింగవచ్చు. దీంతో ఆకలి బాగా పెరుగుతుంది.
5. ఆకలి లేని వారు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. జీర్ణక్రియకు ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
6. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాక పెరుగులో మెంతుల పొడిని కలుపుకుని తినడం వల్ల కూడా ఆకలి పెరుగుతుంది. అలాగూ 2 టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మెంతులను తీసి పరగడుపునే తినాలి. తరువాత ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే ఆకలి పెరుగుతుంది.
7.దాల్చిన చెక్కను పొడి చేసి, మీరు తినే గ్రేవీలలో మరియు టోస్ట్ లలో కొద్దిగా జోడించాలి . లేదా కొద్దిగా షుగర్ మరియు తేనెకు మిక్స్ చేసి నేరుగా తీసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.