Benefits of Tears : కన్నీళ్లు ఆరోగ్యకరమేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

ఏడుపు అనేది ఆరోగ్యకరమైన, సాధారణమైన, మానవధేహ పనితీరుగా చెప్పవచ్చు. ఇది నొప్పిని తగ్గించడానికి, కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో కన్నీళ్లు ఎన్నిరకాలు అవిఅవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Benefits of Tears : ఏడుపు అనేది భావోద్వేగానికి సహజ ప్రతిచర్య. ఏడుపును దుఃఖంతో పోల్చి చెబుతాము. ఏడుపు అనేది విపరీతమైన ఆనందంతో వస్తుంది. కొన్నిసార్లు కోపం, బాధ వంటి కారణాలతో కూడా వస్తుంది. ఒక భావోద్వేగానికి శరీరం యొక్క ప్రతిచర్య కారణంగా ఏడుపు వస్తుంది. ఏడుపు కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఏడుపు అనేది ఆరోగ్యకరమైన, సాధారణమైన, మానవధేహ పనితీరుగా చెప్పవచ్చు. ఇది నొప్పిని తగ్గించడానికి, కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో కన్నీళ్లు ఎన్నిరకాలు, అవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బేసల్ కన్నీళ్లు: ఈ రకమైన కన్నీళ్లు యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండిన ఐసోజైమ్ అనే ద్రవాన్ని కలిగి ఉండే ప్రాథమిక కన్నీళ్లు. బేసల్ కన్నీరు కళ్లను తేమగా ఉంచడంలో సహాయపడతాయి.

రిఫ్లెక్స్ కన్నీళ్లు: ఈ కన్నీళ్లు కళ్లకు చికాకు కలిగించే వాటికి ప్రతిస్పందనగా వస్తాయి. అది దుమ్ము , ఉల్లిపాయలు కోసేటప్పుడు ఈ తరహా కన్నీళ్లు వస్తాయి.

భావోద్వేగ కన్నీళ్లు: భావోద్వేగ కన్నీళ్లు శరీరానికి ప్రశాంతత , నొప్పి నుండి ఉపశమనం కలిగించటమే కాకుండా, శరీరంలోని కార్టిసాల్ మొత్తాన్ని సహజంగా నియంత్రించే ఒత్తిడి హార్మోన్లను కూడా కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు, అవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే తీరు ;

ఆరోగ్యకరమైన నరాలు : కన్నీళ్లు నరాల పెరుగుదల కారకాలకు మూలం. ఇది న్యూరాన్ల పెరుగుదల, మనుగడకు మరింత తోడ్పాటునిస్తాయి.

ఓదార్పు ప్రభావం: ఏడుపు ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఓదార్పును కలిగిస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది.

కరుణ: ఏడుపు అనేది అటాచ్మెంట్ ప్రవర్తనకు ఒక రూపం. కరుణ, దయ వంటి సామాజిక ప్రవర్తనను పెంచుతుంది.

నొప్పి: ఏడుపు అనేది నొప్పికి శరీరం యొక్క సహజ ప్రతిచర్య. ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ విడుదల చేయడం ద్వారా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

కళ్లను శుభ్రపరచడం: కళ్లను శుభ్రంగా, తేమగా ఉంచడంలో కన్నీళ్లు సహాయపడతాయి.

దృష్టి: కళ్ళు సరిగ్గా తేమగా ఉంచనప్పుడు, అవి అస్పష్టమైన దృష్టికి దారి తీస్తాయి. రెప్పలు ఆర్పిన ప్రతిసారీ ఉత్పత్తి అయ్యే బేసల్ కన్నీళ్లు, కళ్లను తేమగా ఉంచడానికి ,శ్లేష్మ పొరలను రక్షించడానికి తోడ్పడతాయి.

ఒత్తిడి: ఏడుపు అనేది ఒత్తిడి హార్మోన్ల నుండి ఉపశమనం పొందటానికి శరీరం యొక్క ఒక మార్గంగా చెప్పవచ్చు. ఏడ్చిన తర్వాత ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు