Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవా?…

అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే జీర్ణ పరమైన సమస్యలు అధికమౌతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్య పెరుగుతుంది. శరీరానికి విశ్రాంతి లేమి సమస్య పెరుగుతుంది.

Ginger Tea : నిద్రలేవగానే చాలా మంది టీ తాగాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఒత్తిడి, పనిభారం నుంచి ఉపశమనం పొందడానికి టీ తాగేవారు అధికంగా ఉన్నారు. టీలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఎవరికి ఇష్టమైన టీని వారు తాగటం అలవాటుగా చేసుకుంటారు. తమకు నచ్చిన టీని మాత్రమే రోజులో ఎక్కవసార్లు తాగే వారు ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో అల్లం టీని ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే అల్లం టీ తాగటం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గిపోతాయని, ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న నమ్మకం చాలా మందిలో ఉంది.

అయితే అల్లం టీ తీసుకోవడం వలన కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక నివేధక అల్లం టీ ఎక్కువ సార్లు రోజు మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుదుని పేర్కొంది. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ అల్లంను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానీ కలిగే అవకాశం ఉంది. అల్లం టీని ఎక్కువగా తాగడం ద్వారా తల తిరగడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే జీర్ణ పరమైన సమస్యలు అధికమౌతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్య పెరుగుతుంది. శరీరానికి విశ్రాంతి లేమి సమస్య ఉత్పన్నమౌతుంది. అల్లం టీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్ అనే మూలకం వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. జుట్టు పెరుగుదలను నిలిచిపోయాలా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోవటం జరుగుతుంది. రాత్రి సమయంలో అల్లం టీని తీసుకోవటం మంచిది కాదు. రోజు మొత్తంలో ఒకటి రెండు సార్లు మినహా అల్లం టీని పెద్దగా తీసుకోకూడదు.

ట్రెండింగ్ వార్తలు