Breast Milk : తల్లి పాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికమా?…

శిశువు పుట్టిన మొదటి 30 నుండి 60 నిమిషాలు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో పాలు చీకటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది.

Breastfeeding

Breast Milk : చిన్నారి శిశువులకు తల్లిపాలను మించిన మంచి ఆహారం లేదనే చెప్పాలి. ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు తల్లిపాల ద్వారా శిశువులకు అందించటం వల్ల వారి ఆర్యోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి. కొంతమంది తల్లులు బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఉన్న అపోహలతో పిల్లలకు పాలు ఇచ్చేందుకు అంగీకరించరు. దీంతో అటు శిశువు , ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టి వెంటనే తల్లి పాలివ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం.

తొమ్మిది నెల ల పాటు తల్లి గర్భంలో పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. అనంతరం శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావడం ప్రారంభమవుతాయి. శిశువుకు జన్మనిచ్చిన కొంతసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్కరం. మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలి చ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి. 7,8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీ నివల్ల ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది.

తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు , పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాన్ని అందజేయ డం మంచిది. ఇక బిడ్డకు ప్రతి రెండు , మూడు గం టలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే నాలుగు గంటల కైనా పాలివ్వాలి.

శిశువు పుట్టిన మొదటి 30 నుండి 60 నిమిషాలు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో పాలు చీకటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. వెంటనే తల్లి పాలు ఇవ్వటం వలన, అదికూడా కోలాస్ట్రం మెట్టమొదట వచ్చే పాలలో ఉంటుది.ఇది త్రాగించటం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులనుండి దూరంగా ఉంచుతుంది. ఇది ఒక టానిక్ లా పనిచేస్తుంది. తల్లులు ఆపరేషన్ ద్వారా కానుపు అయినాకాని, తల్లిపాలు 4గంటల తరువాత ఇవ్వవచ్చు.

తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్‌తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైర స్‌ ఇన్‌ఫెక్షన్స్‌ , అలర్జీ రాకుండా ఉంటాయి. ఈ పాలల్లో ప్రొటెక్టివ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. దీంతో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు.

తల్లిపాలల్లో ప్రోటీన్లు , విటమిన్లు , కార్బోహైడ్రేట్లు , మినరల్స్‌ , కాల్షియం , పొటాషి యం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగగలుగుతుంది. నవజాత శిశువులకు తల్లి పాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇది అండాశయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను నివారిస్తుంది. ప్రసవానంతరం గర్భాశయ పరిమాణాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. తల్లి పాలు ఎల్లప్పుడూ శిశువుకు సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి. తల్లి పాలివ్వడం రోజుకు 500 అదనపు కేలరీలు శక్తి ఖర్చవుతుంది. రోగనిరోధక శక్తికి, అంటువ్యాధులతో పోరాడటానికి , వ్యాధులను నివారించడానికి తల్లి పాలు శ్రేయస్కరంగా చెప్పవచ్చు.