Care Of Feet : చలికాలంలో కాళ్ల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా? పాదాలను సంరక్షించుకోవటం ఎలాగంటే?

పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతుంటే ఆ భాగంలో ఆలివ్ నూనెను అప్లై చేసి, మెత్తగా మర్ధన చేసుకోవాలి. ఈ ఆలివ్ ఆయిల్ చర్మానికి ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో, చర్మ కణాలను సజీవంగా ఉంచటంలో సహాయపడుతుంది.

Care Of Feet : చలికాలంలో కాళ్ల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా? పాదాలను సంరక్షించుకోవటం ఎలాగంటే?

Are you suffering from cracked feet during winter? How to take care of feet?

Updated On : November 14, 2022 / 5:25 PM IST

Care Of Feet : చలికాలం సీజన్‌లో తక్కువ తేమ, చలి గాలులు, పొడి వాతావరణం వంటి పరిస్థితులు చర్మం నుండి తేమను దూరం చేస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది, చర్మంపై మృతకణాలు పేరుకుపోయి ముఖం, పెదాలు, అరికాళ్లపై పగుళ్లు ఏర్పడతాయి. దీనివల్ల మంట, నొప్పి కలుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చాలా తీవ్రమవుతుంది. చర్మంపై పగుళ్లు ఉంటే హానికర సూక్ష్మ జీవులు లోపలికి ప్రవేశిస్తాయి. కాళ్ల పగుళ్లు తీవ్రమైనపుడు సైల్యూలైటిస్ అనే ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.

చలికాలంలో పాదాల సంరక్షణ ;

ఆయిల్ మసాజ్ ; పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతుంటే ఆ భాగంలో ఆలివ్ నూనెను అప్లై చేసి, మెత్తగా మర్ధన చేసుకోవాలి. ఈ ఆలివ్ ఆయిల్ చర్మానికి ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో, చర్మ కణాలను సజీవంగా ఉంచటంలో సహాయపడుతుంది. గోరువెచ్చని కొబ్బరినూనెతో అయినా పాదాలను మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకు హాయిగా ఉంటుంది, రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది.

పాదాలకు టబ్ బాత్ ; ఒక టబ్ తీసుకొని అందులో గోరు వెచ్చని నీటిని నింపి. ఆ నీటిలో కొద్దిగా షాంపూ, నిమ్మరసం కలపండి. ఈ నీటిలో పాదాలను  20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత క్లీనింగ్ బ్రష్ , ప్యూమిస్ స్టోన్ తో పాదాలను శుభ్రం చేసి పొడిక్లాత్ తో పాదాలను తుడవాలి.

పాదాలకు కాటన్ సాక్స్ ధరించండి ; కాటన్ సాక్స్ ధరించడం ద్వారా కఠినమైన వాతావరణం, కాలుష్యం, దుమ్ము నుండి మీ పాదాలను రక్షించుకోండి. కాటన్ సాక్స్ గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి , అందువల్ల మీ పాదాల నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు.

మాయిశ్చరైజేషన్ ; చర్మాన్ని మృదువుగా ఉంచడానికి పాదాలకు సున్నితమైన మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చలికాలంలో చర్మం పొడిబారకుండా, పాదాల పగుళ్లు కాపాడుకోవచ్చు.