Peddi : ‘పెద్ది’ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. 1000 మందితో..

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ పెద్ది(Peddi). బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ డ్రామాగా..

Peddi : ‘పెద్ది’ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌.. రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. 1000 మందితో..

Peddi massive introduction song with 1000 dancers in Mysore

Updated On : August 27, 2025 / 5:24 PM IST

Peddi : గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ పెద్ది(Peddi). బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. జాన్వీక‌పూర్ క‌థానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

నేడు (ఆగ‌స్టు 27) వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని చిత్ర యూనిట్ ఓ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలోని ఓ అదిరిపోయే పాట షూటింగ్‌ను నేటి నుంచి ప్రారంభించ‌న‌ట్లు తెలిపింది. ఏఆర్ రెహ‌మాన్ అందించిన ఈ మాస్ బీట్స్ పాట చిత్రానికే హైలెట్‌గా నిల‌వ‌నుంద‌ని అంటున్నారు.

Maaman : ఓటీటీలో సూరి ‘మామ‌న్‌’ .. నేటి నుంచి తెలుగులో కూడా..

ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేయ‌నుండ‌గా 1000 మంది డ్యాన్స‌ర్లు ఇందులో పాల్గొన‌నున్నారు. మైసూర్‌లో ఈ పాట షూటింగ్‌ను చేస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది మార్చి 27 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.