Trump Tariffs : ట్రంప్ టారిఫ్‌లు అమల్లోకి వచ్చేశాయ్.. ఇండియాలో దారుణంగా దెబ్బతినే రంగాలివే.. తెలుగు రాష్ట్రాల్లో ఇంపాక్ట్..

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద విధించిన 50 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చేశాయి.

Trump Tariffs : ట్రంప్ టారిఫ్‌లు అమల్లోకి వచ్చేశాయ్.. ఇండియాలో దారుణంగా దెబ్బతినే రంగాలివే.. తెలుగు రాష్ట్రాల్లో ఇంపాక్ట్..

Trump Tariffs

Updated On : August 27, 2025 / 4:36 PM IST

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద విధించిన 50 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చేశాయి. 27వ తేదీ 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం.. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతుల విలువ ప్రతి ఏటా 86.5 బిలియన్ డాలర్లు. ఎగుమతి అయ్యే వాటిలో మూడింట రెండు వంతుల వస్తువులు ఈ టారిఫ్ పరిధిలోకి రానున్నాయి. వీటి విలువ సుమారు 60 బిలియన్ డాలర్లు. ఓ రకంగా రూ.5.27 లక్షల కోట్లు. (Trump Tariffs)

Also Read: ట్రంప్‌ని లైట్ తీసుకున్న మోదీ..? నాలుగు సార్లు కాల్ చేస్తే కూడా..

అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే రంగాలు ..

GTRI అంచనా ప్రకారం టెక్స్ టైల్స్, జెమ్స్ – జ్యూయలరీ, లెదర్, ఆహారం, ఆటోమొబైల్ రంగాల మీద తీవ్ర ప్రభావం చూపనుంది. టారిఫ్ ల వల్ల ఎగుమతులపై 70 శాతం ప్రభావం చూపే అవకాశం ఉందని GTRI ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ అంతచనా వేశారు. అంటే 60 బిలియన్ డాలర్ల నుంచి 18.6 బిలియన్ డాలర్లకు (రూ.1.63 లక్షల కోట్లు) పడిపోయే
ప్రమాదం ఉంది.

రొయ్యల ఎగుమతులపై ప్రభావం ..

ప్రతి ఏటా ఇండియా నుంచి 2.4 బిలియన్ డాలర్ల రొయ్యల ఎగుమతి జరుగుతోంది. అందులో ఏపీ నుంచి ఎగుమతులు అగ్రస్థానం. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల నుంచి అయ్యే ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీటి మీద టారిప్ లు 60 శాతానికి కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీ నుంచి ఎగుమతులు పడిపోతే అప్పుడు ఈక్వెడార్, వియత్నాం, ఇండొనేసియా, థాయిలాండ్ లాంటి దేశాలు అమెరికా మార్కెట్ లో వేళ్లూనుకోవడానికి అవకాశం ఉంది

జెమ్స్, జ్యూయలరీ ..

ఇండియా నుంచి అమెరికాకి సుమారు 10 బిలియన్ డాలర్ల జెమ్స్, జ్యూయలరీ ఎగుమతులు అవుతున్నాయి. ఈ రంగం మీద మొదట 2.1 శాతం టారిఫ్ లు ఉండేవి. ఇప్పుడు అది 52.1 శాతానికి పెరిగింది. ఈ దెబ్బతో ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా గుజరాత్ లోని సూరత్, ముంబై, జైపూర్ జ్యూయలరీ మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాల కోత మొదలైంది. లక్ష ఉద్యోగాలు పోయాయి. అదే టైమ్ లో చైనా, ఇజ్రాయెల్, బెల్జియం, మెక్సికో దేశాలకు లక్కీ చాన్స్ దొరకనుంది. ఆ దేశాల నుంచి అమెరికాకు జెమ్స్, జ్యూయలరీ ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.

కార్పెట్లు ..

భారత్ నుంచి అమెరికాకి సుమారు 1.2 బిలియన్ డాలర్ల విలువైన కార్పెట్లు ఎగుమతి అవుతున్నాయి. ఫర్చీచర్, బెడ్స్ లాంటివి మరో 1.1 బిలియన్ డాలర్ల ఎక్స్ పోర్ట్స్ అవుతున్నాయి. వీటి మీద 50 శాతం టారిఫ్ పడుతోంది. జోధ్ పూర్, జైపూర్, మొరాదాబాద్, షహరాన్ పూర్ లాంటి ప్రాంతాల నుంచి ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ గ్యాప్
ను చైనా, మెక్సికో, తుర్కియే, వియత్నాం పూడ్చనున్నాయి.

లెదర్, ఫుట్ వేర్ ..

సుమారు 1.2 బిలియన్ డాలర్ల విలువైన లెదర్, ఫుట్ వేర్ అమెరికాకి ఎగుమతి అవుతున్నాయి. ఆగ్రా, కాన్పూర్ తో పాటు తమిళనాడులోని అంబర్ – రాణిపట్ క్లస్టర్స్ నుంచి ఎగుమతులు అవుతున్నాయి. టారిఫ్ ప్రభావంతో ఆ ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. అదే టైమ్ లో వియత్నాం, చైనా, ఇండొనేసియా, మెక్సికో నుంచి ఎగుమతులు పెరిగే
అవకాశం ఉంది

వ్యవసాయం, ప్రాసెస్డ్ ఫుడ్..

బాస్మతి రైస్, టీ, సుగంధ ద్రవ్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కలిపి సుమారు 6 బిలియన్ డాలర్ల ఎగుమతులు అవుతున్నాయి. వీటిన్నిటి మీద 50 శాతం టారిఫ్ లు పడుతున్నాయి. ఇండియా నుంచి దిగుమతులు తగ్గితే ఆ లోటును పాకిస్థాన్, థాయిలాండ్, వియత్నాం, కెన్యా, శ్రీలంక నుంచి భర్తీ చేసేందుకు యూఎస్ ప్రయత్నిస్తోంది.