Mango Nuts : మామిడి టెంక పారేస్తున్నారా?….అయితే ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే!…

మామిడికాయ బాగా పక్వానికి వచ్చాక అందులో విత్తనం ఏర్పడుతుంది. దీనినే టెంక అని పిలుస్తారు. అయితే దీనిని తినటానికి పెద్దగా పనికి రాదు కాని దానిని పొడి రూపంలో చేసుకుని వినియోగించుకోవచ్చు.

Mango

Mango Nuts : వేసవికాలం వచ్చిందంటే మార్కెట్లో మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. రుచికరమైన ఈ పండ్ల వాసన చూస్తేనే అమాంతం తినేయలనిపిస్తుంది. ఎంతో రుచికరమైన మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పుల్లగా, తియ్యగా నోరూరించే మామిడిని తినేందుకు వేసవి కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. ఇటీవలికాలంలో అన్నిసీజన్లలో మామిడి కాయలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వేసవితో పోల్చితే మిగలిన కాలాల్లో ఇవి తక్కువగానే అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు.

చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను తట్టుకొనే సామర్థ్యాన్ని మామిడి పండ్లు అందిస్తాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్ బి6 చర్మంలోని సెబమ్‌ను తగ్గిస్తుంది. మామిడి పండ్లలోని పొటాషియం చర్మానికి తేమ అందిస్తుంది. మామిడి కాయతోపాటు అందులో ఉండే టెంకతో కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి.

మామిడికాయ బాగా పక్వానికి వచ్చాక అందులో విత్తనం ఏర్పడుతుంది. దీనినే టెంక అని పిలుస్తారు. అయితే దీనిని తినటానికి పెద్దగా పనికి రాదు కాని దానిని పొడి రూపంలో చేసుకుని వినియోగించుకోవచ్చు. ఈ పొడిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. చాలామంది మామిడి కాయను తిని టెంకను పారేస్తుంటారు. అయితే ఆటెంక వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు ఆపనిచేయరు.

చుండ్రు తగ్గించేందుకు మామిడి టెంకలోని గింజలు ఉపకరిస్తున్నాయి. టెంకను పగలగొట్టి గింజలు తీసి ఎండబెట్టాలి. తరువాత పొడిచేసి నూనెతో కలిపి బాగా మరిగించాలి. ఆ నూనెను తలకు రాసుకుంటే జుట్టు ఊడటం, బట్టతల ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. మామిడిటెంకలోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి.

విరేచనాల సమస్యతో బాధపడుతున్న వారికి రోజుకు కనీసం రెండు సార్లు మామిడి టెంక పొడిని తేనెతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అలాగే ఉదర సంబంధ వ్యాధులకు మామిడిటెంక మంచి ఔషధం మామిడిటెంక పొడిని మజ్జిగలో కలిపి కాస్త ఉప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టాలంటే మామిడిటెంక పొడిలో కొబ్బరి, ఆలీవ్, ఆవనూనెలు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి ఐప్లె చేస్తే చర్మం మెరిసిపోతుంది. మామిడి టెంకను పొడి చేసుకొని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలిపి వండి వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.

మామిడి గింజలు గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించటానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని ఎలా వాడాలన్న విషయం ఆయుర్వేదనిపుణుల ద్వారా తెలుసుకోవచ్చు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గించటంలో మామిడి గింజల పొడి ఉపకరిస్తుంది.