Are you using excessive amounts of chilli, salt and spices in the preparation of food? Beware of risking your health!
Chilli, Salt And Spices : స్పైసీగా ఉండే సుగంధ ద్రవ్యాలతో కూడిన ఆహార పదార్ధాలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వీటిని మితిమీరి తీసుకోవటం ప్రమాదమేనంటున్నారు నిపుణులు. కారం, ఉప్పుతోపాటు, మసాలాలు అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మిర్చి పౌడర్ వాడడం లేదా మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. కారంపొడి అధిక వినియోగం కడుపుకు మంచిది కాదు. ఇది పరిమిత పరిమాణంలో తినాలి. సాధారణంగా మసాలా దినుసులు డీప్‌ఫ్రై చేసినప్పుడు అవి పొట్ట లోపలి భాగంలో అతుక్కుని సమస్యలను కలిగిస్తాయి.
కారం ఎక్కువ తింటే ఎసిడిటీ వస్తుంది. తద్వారా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. బలహీనత, మూర్ఛ, మైకము మొదలగు వికారాలు వస్తాయట. గొంతు, కడుపులో మంట వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. గరం మసాల కారంతో పాటు మసాలాలు ఎక్కువ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా లవంగాలు, మిరియాలు ఎక్కువగా వాడితే జీర్ణకోశ సమస్యలు వస్తాయి.
మసాలాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. తలనొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఆర్థరైటిస్ మరియు వికారం వంటి ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేయడంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు తోడ్పడతాయి. ఈ విషయం వాస్తమే అయినప్పటికీ పరిమిత మోతాదులో తీసుకుంటే మాత్రమే వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. చాలా మంది రోజువారిగా మసాల ఆహారాలను మాత్రమే తీసుకుంటే మేలు చేయటానికి బదులు వాటివల్ల కీడు అధికంగా ఉంటుంది. ఆరోగ్య పరమైన ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది.
కాబట్టి మసాలు, కారం, ఉప్పు వంటి వాటిని ఎంత తక్కువ మోతాదులో , అప్పుడప్పుడు వాడుకోవటం మంచిది. అతి వినియోగం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని మరువకూడదు.