AstraZeneca Vaccine : కరోనా టీకా రెండో డోసు వ్యవధి పెరిగితే మంచిదేనట!

కరోనా వ్యాక్సిన్ డోసుల వ్యవధి మంచిదేనంటూ ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కొవిషీల్డ్‌ రెండో డోసుకు ఎక్కువ వ్యవధి తీసకోవచ్చునని అంటున్నారు పరిశోధకులు.

Astrazeneca Vaccine

AstraZeneca Vaccine : కరోనా వ్యాక్సిన్ డోసుల వ్యవధి మంచిదేనంటూ ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కొవిషీల్డ్‌ రెండో డోసుకు ఎక్కువ వ్యవధి తీసకోవచ్చునని అంటున్నారు పరిశోధకులు. రెండో డోసు గ్యాప్ తీసుకోవడం ద్వారా  మూడో డోసును కూడా ఆలస్యంగా అవుతుందని, దాంతో కరోనా ఇమ్యూనిటీ బాగా పెరుగుతోందని గుర్తించారు.

మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని కనుగొన్నారు. 45 వారాల వ్యవధితో కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందని స్పష్టం చేసింది. రెండో డోసు తీసుకున్న 6 నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వెల్లడించింది. దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువగా ఉంటుందని ఆండ్య్రూ పోలర్డ్‌ అభిప్రాయపడ్డారు.

మొదటి డోసు వేసుకున్న పది నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి ఇమ్యూనిటీ పెరిగిందని తెలిపారు. మూడో డోసును ఆలస్యం వల్ల కూడా పాజిటివ్ ఫలితాలు వచ్చినట్టు తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్‌తో కొంతమందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో టీకాను నిషేధించగా.. కొన్ని దేశాలు యువతకు టీకా అనారోగ్యకరమని వెల్లడించాయి. ఆస్ట్రా-ఆక్స్ ఫర్డ్  వ్యాక్సిన్ అర బిలియన్ మోతాదులను ఇప్పటికే 168 దేశాలకు పంపినట్లు పరిశోధకులు తెలిపారు.