Haley Comet : ఆకాశంలో అద్భుతం..హేలీ తోకచుక్క మళ్లీ వస్తోంది

హేలీ తోక చుక్క పేరు విన్నారా? మీరు కనుక 1980 తర్వాత పుట్టి ఉన్నవాళ్లైతే వినే ఉంటారు. చూసే ఉండొచ్చు. హేలీ మనకు వచ్చి పోయే ఖగోళ మిత్రుడు.

Awesome in the sky..Haley comet is coming again : హేలీ తోక చుక్క పేరు విన్నారా? మీరు కనుక 1980 తర్వాత పుట్టి ఉన్నవాళ్లైతే వినే ఉంటారు. చూసే ఉండొచ్చు. హేలీ మనకు వచ్చి పోయే ఖగోళ మిత్రుడు. ఈ వారంలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. మిలా మిలా మెరిసే హేలీ తోక చుక్క నుంచి అవశేషాలు రాలి పడనున్నాయి. హేలీ తోక చుక్క అవశేషాలు మంగళవారం నుంచి గురువారం వరకు మనకు కంటికి కనిపించనున్నాయి. ఈ తోక చుక్క చివరి సారిగా 1986లో కనిపించింది. మళ్లీ 2061 వరకు మరోసారి కనిపించదు.

ఆకాశంలో తెల్లటి పాయలా మెరిసే ఈ తోక చుక్క అవశేషాలు ఇప్పటికీ మన భూ వాతావరణంలో తిరుగుతున్నాయి. ప్రతి ఏడాదిలో రెండు సార్లు ఈ తోక చుక్క అవశేషాలు కనిపిస్తాయి. ఈ వారమంతా భూమంతా సౌరశక్తి గురుత్వాకర్షణ శక్తికి హేలీ తోక చుక్క నుంచి రాలిపోయిన దుమ్ముతో నిండిపోతుంది. ఈ తోక చుక్క దుమ్మ ధూళి మే 28 వరకు తిరుగుతూ కనిపిస్తాయి. తర్వాత రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ తోక చుక్క అవశేషాలు చూడొచ్చు.

తక్కువ ప్రకాశంతమైన ప్రాంతంలో నిలబడి ఆకాశంలో అద్భుతాన్ని చూడవచ్చు. అనేక వందల ఏళ్ల క్రితం తోక చుక్క నుంచి వేరైనా ఉల్కల వలే ఈ హేలీ తోక చుక్క ముక్కచెక్కలు ప్రస్తుత కక్ష్యలో తిరుగుతున్నాయి. ఏది ఏమైనా తోక చుక్క భూమి కక్ష్యను దాటదు. భూ వాతావరణంలోకి రాగానే అదృశ్యమై పోతున్నాయి. అందువల్లనే ప్రమాదం ఏమీ ఉండదు. కానీ ఆ సమయంలో నల్లటి ఆకాశంలో నక్షత్రాలు రాలి పడుతున్న ఫీలింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు