Ayurveda Water: ఎండ వేడికి కాగిన నీళ్లు తాగమంటోన్న ఆయుర్వేద

సరైన ఆరోగ్యం కోసం శరీరానికి డి-విటమిన్ అవసరాలను తీర్చడానికి సూర్యరశ్మికి తగినంత ఎక్స్‌పోజర్ అవసరమని అందరికీ తెలిసిన విషయమే. ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన సన్-ఛార్జ్డ్ వాటర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?

Ayurveda Water

Ayurveda Water: సరైన ఆరోగ్యం కోసం శరీరానికి డి-విటమిన్ అవసరాలను తీర్చడానికి సూర్యరశ్మికి తగినంత ఎక్స్‌పోజర్ అవసరమని అందరికీ తెలిసిన విషయమే. ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన సన్-ఛార్జ్డ్ వాటర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?

“ఆయుర్వేదం ప్రకారం, సూర్యరశ్మి చాలా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయగలదు” ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నితికా కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు.  సూర్యుడి ఎండ నుంచి వేడి చేసిన నీరు ఆరోగ్యాన్ని పెంచగల అనేక ప్రయోజనాలను అందిస్తుందిజ

సూర్యుడి నుంచి ఛార్జ్ చేసిన నీటిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి.

Read Also : ఆరోగ్యానికి మేలు చేసే ఎండు ఉసిరి ముక్కలు!

* మీరు రోజంతా శక్తి లేమిగా భావించే వారైతే, సన్ ఛార్జ్ చేసిన నీటిని తాగడం మంచిది.

* ఇది చర్మానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇది ” దద్దుర్లు , ఎరుపు వంటి సాధారణ చర్మ సమస్యలను నయం చేయడమేకాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది”.

* సాధారణ కంటి లేదా చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, తప్పనిసరిగా సన్ ఛార్జ్ చేసిన నీటితో కడగాలని డాక్టర్ కోహ్లీ సూచించారు.

“ఈ నీరు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయని, ఇతర ఏవైనా సాధారణ సమస్యలను దూరంగా ఉంచుతుంది.”

* సన్ ఛార్జ్ చేసిన నీరు పూర్తిగా సహజమైనది. మీ ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావాలను చూపించదు. మందులు లేదా చికిత్స చేయించుకుంటున్నట్లయితే వైద్యుడ్ని సంప్రదించిన తర్వాత వాడమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

సన్ ఛార్జ్ చేసిన నీటిని ఎలా తయారు చేయాలి?

* ఇంట్లో ఈ “మేజిక్ కషాయం” చేయడానికి, ఆయుర్వేద నిపుణుడిచే భాగస్వామ్యం చేయబడిన ఈ చిట్కాలను అనుసరించండి.
* గ్లాస్ బాటిల్‌లో నీళ్లు నింపి కనీసం 8 గంటలపాటు ఎండలో ఉంచాలి. ప్రతిరోజూ ఉత్తమ ఫలితాల కోసం 3 రోజుల పాటు 8 గంటల పాటు ఎండలో ఉంచవచ్చు.
* నీటిని ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి. అలా చేస్తే నీటి ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తుంది.
* రోజంతా ఇదే నీటిని తాగేందుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సీసాలు ఎండలో ఉంచవచ్చు.