Amla Pieces : ఆరోగ్యానికి మేలు చేసే ఎండు ఉసిరి ముక్కలు!

ఉసిరిలో సి విటమిన్ అధికం. సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న సమయంలో రెండు టీస్పూన్ల ఉసిరి పొడిని , రెండు టీస్పూన్ల తేనెతో కలిపిన మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Amla Pieces : ఆరోగ్యానికి మేలు చేసే ఎండు ఉసిరి ముక్కలు!

Amla Pieces

Updated On : June 6, 2022 / 4:51 PM IST

Amla Pieces : ఉసిరి ఔషధాల గని. ఆయుర్వేద వైద్యంలో ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఉంది. యాంటీ ఆక్సిడెంట్ శక్తి ఉసిరిలో అధికంగా ఉంటుంది. ఉసిరిని పచ్చడిగా , పచ్చిగా తింటారు. ఉసిరిని ఎండబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉసిరిని ఎండబెట్టిన ముక్కలుగా ,పొడిగా కూడా తీసుకోవచ్చు. ఉసిరిని భోజనం తర్వాత రెండు ముక్కలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

తేనె , ఎండిన ఉసిరిని తీసుకోవడం వలన శరీరంలో కఫ దోషాలను తగ్గించుకోవచ్చు. ఎండబెట్టిన ఉసిరిని రోజూ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఉసిరి పొడిని వాటర్ లో కలిపి తీసుకోవచ్చు. ఉసిరి రసాన్ని అరకప్పు నీటిలో వేసి పుక్కిలి పడితే నోటి పూతనుంచి ఉపశమనం కలుగుతుంది.

ఉసిరిలో సి విటమిన్ అధికం. సీజనల్ వ్యాధులైన జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న సమయంలో రెండు టీస్పూన్ల ఉసిరి పొడిని , రెండు టీస్పూన్ల తేనెతో కలిపిన  మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గొంతునొప్పి, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఉసిరి మలబద్దకం సమస్యలను నివారిస్తుంది. తీసుకున్న ఫుడ్ త్వరగా జీర్ణమౌతుంది.