ఇప్పటి ఆధునిక జీవనశైలి, అసమతుల్యమైన ఆహారపు అలవాట్లు, మద్యం అధికంగా సేవించడం లివర్ చెడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు. ఈ పరిస్థితుల్లో, కొన్ని ఆయుర్వేద మూలికలు లివర్ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి.
ఏయే మూలికలు లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయాంటే..?
ఉసిరికాయ: ఉసిరికాయ లివర్‌ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఉసిరికాయలో హెపటో-ప్రొటెక్టివ్ లక్షణాలు ఉండటంతో ఇది లివర్ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాడే విధానం:
- తాజా ఉసిరికాయను తినవచ్చు.
- ఉసిరికాయ రసం లేదా క్యాండీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
అలోవెరా: అలోవెరాలో సమృద్ధిగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది లివర్‌ను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి రక్షిస్తుంది. పరిమిత మోతాదులో అలోవెరా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
వాడే విధానం:
- అలోవెరా రసాన్ని తీసుకోండి.
- ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 2-3 టీ స్పూన్లు అలోవెరా జ్యూస్‌ను అంతే పరిమాణంలో నీటితో కలిపి తాగాలి.
పునర్నవ: పునర్నవ మూలిక లివర్ వాపు సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
వాడే విధానం:
- పునర్నవ పొడి లేదా సిరప్ రూపంలో తీసుకోవచ్చు.
- ఆయుర్వేద వైద్యుడిని సంప్రదిస్తే ఎంత మోతాదులో తీసుకోవాలో చెబుతారు.
లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ఏమీ చెయ్యాలంటే..?
- రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆహారంలో చేర్చండి. లివర్ ఆరోగ్యానికి గ్రీన్ వెజిటేబుల్స్, పండ్లు, పప్పులు, ముల్లంగి, క్యారెట్, సొరకాయ వంటివి తినండి.
- మద్యం లివర్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి దాన్ని పూర్తిగా మానేయండి. రెగ్యులర్ వ్యాయామం లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
- ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం, యోగా లేదా ప్రాణాయామం చేయండి.
- అధిక ఒత్తిడి కూడా లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. టెన్షన్స్ తీసుకోవద్దు.