Barley
Barley Water : బార్లీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బార్లీ నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు కొంతమంది పలు రకాల పద్దతులను అనుసరిస్తుంటారు. కొంత మంది శీతల పానీయాలను తాగుతూ.. సేద తీరుతుంటే.. మరికొంతమంది వేసవి తాపం నుంచి గట్టేక్కేందుకు సహజసిద్ధమైన పద్దతులను అనుసరిస్తారు. అలాంటి సహజసిద్ధమైన పానీయాల్లో ఇంట్లో తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం ఒకటి.
బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు.
బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రం అవుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వారు బార్లీ నీటిని తాగడం వల్ల వేడి తగ్గుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది.
మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని నిత్యం తాగితే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బార్లీ నీటిని తాగడం వల్ల చిన్న సైజులో ఉండే కిడ్నీ స్టోన్లు ఇట్టే కరిగిపోతాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. నిత్యం బార్లీ నీటిని తాగాలి. బార్లీ నీటిని తాగడం వల్ల మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని నిత్యం ఉదయం, సాయంత్రం తాగాలి.
కిడ్నీలో రాళ్లను కరింగించే శక్తి బార్లీ గింజల నీటికి ఉంది. మలబద్దకంతో బాధపడేవారికి బార్లీ నీరు మంచి ఔషదంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గటంతోపాటు, అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
బార్లీ నీరు తాగడం వల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గ్యాస్, ఎసిడిటీ, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలను అదుపులో ఉంచుతాయి. అధిక బరువు ఉన్నవారు బార్లీ నీరు తాగటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.
బార్లీలో బీటా గ్లూకోన్ అనే పదార్ధం శరీరంలో ఉండే హానికరమైన విష పదార్ధాలను , వ్యర్ధాలను విసర్జన క్రియ ద్వారా బయటకు పంపిస్తుంది. ప్రేగుల్ని శుబ్రపరచటంతోపాటు, పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. బార్లీ నీటిని తీసుకోవడం వల్ల మెరుగైన రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా థ్రోంబోసిస్ మరియు హృదయ సంబంధ వ్యాధులను నివారించవచ్చు. బార్లీలోని ట్రిప్టోఫాన్ యొక్క జీవక్రియ హృదయ సంబంధ రోగులకు తగిన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి గింజలను వడకట్టాలి. తరువాత వచ్చే నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని నిత్యం తాగాలి. దీంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.