Palindrome: ఆధ్మాత్మికంగా 22.02.2022 తేదీ ప్రత్యేకత

2022 ఫిబ్రవరి 22 తేదీ.. అంకెల్లో రాస్తే.. 22 - 02 - 2022. ఎటునుంచి చూసినా ఒకేలా ఉండే అంకెలనే పాలిండ్రోమ్ అంటారన్నమాట. ఫిబ్రవరి 22 అంటే 2202.. దీనిని వెనుకకు రాస్తే...

22022022

Palindrome: 2022 ఫిబ్రవరి 22 తేదీ.. అంకెల్లో రాస్తే.. 22 – 02 – 2022. ఎటునుంచి చూసినా ఒకేలా ఉండే అంకెలనే పాలిండ్రోమ్ అంటారన్నమాట. తెలుగులోనూ ఇలాంటి పదాలు బోలెడు కనిపిస్తాయి. విరివి, వికటకవి, సంతసం లాంటివి ఉదహారణగా చెప్పుకోవచ్చు.

ఇక ఇవాళ్టి తేదీ విషయానికొస్తే ఫిబ్రవరి 22 అంటే 2202.. దీనిని వెనుకకు రాస్తే ప్రస్తుత సంవత్సరం 2022 వస్తుంది. అంకెల్లో ప్రత్యేకతగా కనిపిస్తున్న తేదీకి న్యూమరాలజీ ప్రకారం ఏమైనా అర్థం ఉందా అంటే..

జోష్ సీగల్ అనే న్యూమరాలజిస్ట్ .. 2ను న్యూమరాలజీ ప్రకారం అనుసరింపదగ్గది. అంతేకాకుండా ద్వంద శక్తి గలది అని చెబుతున్నారు. తేదీలో ఉన్న అంకెల క్రమాన్ని బట్టి ఈ రోజు ఎంత నెగెటివ్ ఎనర్జీ ఉందో అంతే పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందట. వ్యతిరేక బలాలు భావోద్వేగాలను సమన్వయపరుస్తాయని అంటున్నారు.

Read Also: మీ పుట్టిన తేదీ సంఖ్య ఇదేనా? 2022 మీకు అదృష్టమే.. బాగా డబ్బు సంపాదిస్తారు

ఇంకా ఎవరైతే జీవిత ప్రయాణంలో కెరీర్ లేదా భవిష్యత్ పై క్లారిటీ లేకుండా సందిగ్ధంలో ఉండిపోయారో వారికి స్పష్టత వస్తుందట.

‘వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ తేదీ చాలా ముఖ్యమైనది. రిలేషన్‌షిప్ స్థితిని తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఏమైనా ఒడిదొడుకులు ఉన్నా సమాధానాలు దొరకడం, అభినందనలు అందడం లాంటివి చోటు చేసుకుంటాయి. మామూలు రోజుల్లో జరిగే పని కంటే ప్రత్యేక ఫలితాలు వస్తాయి కాబట్టి ఏదైనా పని స్టార్ట్ చేయడం బెటర్’ అని న్యూమరాలజిస్ట్ సీగల్ చెబుతున్నారు.