Numerology 2022: మీ పుట్టిన తేదీ సంఖ్య ఇదేనా? 2022 మీకు అదృష్టమే.. బాగా డబ్బు సంపాదిస్తారు

ఈ పుట్టిన తేదీ మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది.. రాబోయే 2022 సంవత్సరంలో ఓ సంఖ్య ఆర్థికంగా మంచి విజయాన్ని పొందే అవకాశాలను ఇస్తుంది అని న్యూమరాలజీ పండితులు చెబుతున్నారు.

Numerology 2022: మీ పుట్టిన తేదీ సంఖ్య ఇదేనా? 2022 మీకు అదృష్టమే.. బాగా డబ్బు సంపాదిస్తారు

2022

Numerology 2022: ఈ పుట్టిన తేదీ మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది.. రాబోయే 2022 సంవత్సరంలో ఓ సంఖ్య ఆర్థికంగా మంచి విజయాన్ని పొందే అవకాశాలను ఇస్తుంది అని న్యూమరాలజీ పండితులు చెబుతున్నారు. మీరు మీ కెరీర్‌లో మంచి ప్లేస్ కోసం ఎదరుచూస్తున్నట్లైతే, ఈ తేదీ పుట్టినవారికి కచ్చితంగా మంచి జరుగుతుంది అని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ కొత్త సంవత్సరంలో పురోగతిని పొందుతారు.

పుట్టిన సంఖ్య 6 అయితే, 2022 సంవత్సరం వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌లో అద్భుతమైన పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు, కానీ ఆర్థికంగా ఈ కొత్త సంవత్సరం అదృష్టం వరిస్తూ ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు వచ్చే సంవత్సరం ప్రతిభను కనబరచడానికి పూర్తి అవకాశం పొందుతారు. పెట్టుబడి ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగవచ్చు. ఏదైనా నెలలో 6, 15, 24 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ 6 అవుతుంది. వారికి వచ్చే ఏడాది చాలా బాగుంటుంది.

ఈ పుట్టిన తేదీల్లో మీరు పుట్టి ఉంటే మాత్రం.. ఈ సంవత్సరం మీకు ఉత్తమమైనదిగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వాహన, గృహ సౌభాగ్యం పొందే అవకాశం ఉంటుంది. ఈ పుట్టిన తేదీలు ఉన్నవారికి, వారి జాతకంలో శుక్రుని స్థానం శుభప్రదంగా ఉంటుంది, ముఖ్యంగా వారికి, ఈ సంవత్సరం ఆనందం, సౌకర్యాలు పెరుగుతాయి.

Covid Relief Loan : అపరమేధావి… కరోనా రిలీఫ్ లోన్ తీసుకుని ఖరీదైన కారు, వాచ్ కొన్నాడు

ప్రేమ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఉండవచ్చు. భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం ఉంటుంది. కానీ తగాదాలు, వివాదాలు కూడా వెంటనే పరిష్కరించబడతాయి. వివాహితులు వాదనలకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి నుంచి కెరీర్‌లో ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగాలు మారడం మానుకోండి. మీరు పని చేస్తున్న ఉద్యోగంలో లాభాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం పెట్టుబడికి కూడా అనుకూలం. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు.

Lisa Sparks : వామ్మో.. 7 గంటల్లో 919 మంది పురుషులతో సెక్స్.. మహిళ వరల్డ్ రికార్డ్

చదువుకునే పిల్లలకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. పనికి లోటు ఉండదు. ఈ సంవత్సరం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మీ ఆస్తి కూడా పెరగవచ్చు.