Covid Relief Loan : అపరమేధావి… కరోనా రిలీఫ్ లోన్ తీసుకుని ఖరీదైన కారు, వాచ్ కొన్నాడు

కరోనా, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులకు అండగా నిలిచేందుకు, వాళ్ల బిజినెస్ న‌డ‌వ‌డం కోసం కోవిడ్ రిలీఫ్ పేరుతో లోన్స్ ఇస్తోంది. చాలామంది ఇలా లోన్ తీసుకుని బిజినెస్..

Covid Relief Loan : అపరమేధావి… కరోనా రిలీఫ్ లోన్ తీసుకుని ఖరీదైన కారు, వాచ్ కొన్నాడు

Covid Relief Loan

Covid Relief Loan : కరోనా, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులకు అండగా నిలిచేందుకు, వాళ్ల బిజినెస్ న‌డ‌వ‌డం కోసం కోవిడ్ రిలీఫ్ పేరుతో లోన్స్ ఇస్తోంది. చాలామంది ఇలా లోన్ తీసుకుని బిజినెస్ కోసం వాడుకున్నారు. నష్టాల నుంచి కొంతవరకు బయటపడ్డారు. ఇది ఇలా ఉంటే, ఓ అపరమేధావి అదిరిపోయే స్కెచ్ వేశాడు.

Omicron Third Wave : భారత్‍లో థర్డ్ వేవ్ ఖాయం..! అయినా భయపడాల్సిన అవసరం లేదట

త‌న బిజినెస్ కోసం ఫండ్స్ కావాల‌ని కోవిడ్ రిలీఫ్ కింద ఫేక్ కంపెనీ వివరాలు ఇచ్చి రూ.12 కోట్లు లోన్ తీసుకున్నాడు. ఆ డ‌బ్బుతో అతడు కాస్ట్‌లీ లంబోర్ఘిని కారు, ఖరీదైన రొలెక్స్ వాచ్, ఇతర లగ్జరీ ఐటెమ్స్ కొన్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరింది. చివరికి అధికారులకు తెలిసింది. వారు షాక్ తిన్నారు. ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆ ప్రబుద్దుడికి 9ఏళ్ల జైలు శిక్ష వేసింది.

అతడి పేరు లీ ప్రైస్. వయసు 30ఏళ్లు. కరోనా కారణంగా నష్టపోయిన వ్యాపారులను ఆదుకునేందుకు గతేడాది ప్రభుత్వం పే చెక్ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్ స్కీమ్ తీసుకొచ్చింది. దాని కింద లోన్లు ఇస్తున్నారు. లీ ప్రైస్ కూడా ఈ ప్రొగ్రామ్ నుంచే రుణం తీసుకున్నాడు. ఫండ్స్ పొందేందుకు అతడు పలు రకాల అప్లికేషన్లు వేర్వేరు బ్యాంకులకు ఇచ్చాడు. చాలా బ్యాంకులు అతడి అప్లికేషన్ ను తిరస్కరించాయి. కొన్ని మాత్రం అప్రూవ్ చేశాయి. ప్రైస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో తనకు కంపెనీ ఉందని, 50 మంది ఉద్యోగులు అందులో పని చేస్తున్నారని ఓ అప్లికేషన్ లో రాసిచ్చాడు. ఆ అప్లికేషన్ అప్రూవ్ కావడం డబ్బులు రావడం జరిగాయి.

WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!

కాగా, అతడి ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. అధికారుల ఇన్ స్పెక్షన్ లో లీ ప్రైస్ చేసిన మోసం బయటపడింది. అధికారులు మనీ లాండరింగ్, చీటింగ్, ఫ్రాడ్ కింద అతడిపై కేసులు నమోదు చేశారు. లీ ప్రైస్ మాత్రమే కాదు ఇంకా 120మంది వ్యక్తులు ఇలానే అబద్దాలు చెప్పి లోన్లు పొందారు. వారి వివరాలు కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.