WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వాట్సాప్ లోనే ఒక ట్రిక్ ఉంది.. ఈ ట్రిక్ చాలామందికి తెలియకపోవచ్చు.

WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!

Send A Whatsapp Message To 250 Users At Once Without Making A Group

WhatsApp Broadcast Lists Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే అనేక ఫీచర్లను వాట్సాప్ ప్రవేశపెట్టింది. వాట్సాప్ అందించే ఫీచర్లలో ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయో చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పటివరకూ వాట్సాప్ ద్వారా వీడియోలు, ఫొటోలు, వాయిస్ కాల్స్ పంపుకోవడమే తెలుసు. అందులోనూ కేవలం 5 మందికి మాత్రమే ఏదైనా మెసేజ్ పంపే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువసార్లు పంపేందుకు ప్రయత్నిస్తే.. Forwarded Many Times అనే మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఒకవేళ ఐదుకు మించి ఎక్కువ కాంటాక్టులకు మెసేజ్ ఫార్వర్డ్ చేయలేము.

ప్రతిసారీ ఐదు కాంటాక్టులను ఎంపిక చేసుకుని మాత్రమే ఏదైనా పంపుకునేందుకు వీలుంది. తద్వారా ఒక మెసేజ్ ఎక్కువమందికి పంపాలంటే రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మందికి పంపే ఆప్షన్ లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు చాలామంది గ్రూపులను క్రియేట్ చేస్తుంటారు. ఆ గ్రూపులో యూజర్లను యాడ్ చేసి వారందరికి చేరేలా ఒకే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంటారు. కానీ, అలాకాకుండా గ్రూపుతో సంబంధం లేకుండా గ్రూపు క్రియేట్ చేయకుండానే ఒకే మెసేజ్ 256 మందికి ఒకేసారి పంపుకోవచ్చు. వాట్సాప్ లోనే ఆ ట్రిక్ ఉంది.. బహుషా ఈ ట్రిక్ చాలామందికి తెలియకపోవచ్చు. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ చాలామందికి తెలిసే ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందో మాత్రం తెలియకపోవచ్చు. ఇప్పుడా ఫీచర్ ఉపయోగించి ఒకేసారి 256 మందికి ఎలా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంతకీ ఆ ఫీచర్ పేరేంటో తెలుసా? బ్రాడ్ కాస్ట్ లిస్ట్స్ (Brroadcast Lists) ఫీచర్.. ఈ ఫీచర్ ఏదైనా ఒక మెసేజ్ ను ఒకేసారి 256 కాంటాక్టులకు పంపుకోవచ్చు. కానీ, మీరు పంపే యూజర్ కాంటాక్టు తప్పనిసరిగా మీ ఫోన్ కాంటాక్టు లిస్టులో సేవ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మెసేజ్​ పంపడం కుదురుతుంది. బ్రాడ్ కాస్ట్ లిస్ట్ ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే.. మీ ఫోన్లో Whatsapp ఓపెన్ చేయండి. అందులో రైట్ టాప్ కార్నర్‌లో నిలువుగా త్రీ డాట్స్​ కనిపిస్తాయి. ఆ డాట్లపై నొక్కండి. మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. అందులో New Broadcast ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీరు బ్రాడ్​కాస్ట్​ సెలక్ట్ చేయగానే.. మీ ఫోన్లో సేవ్ చేసిన కాంటాక్ట్​ల లిస్టు కనిపిస్తుంది.

అందులో మీరు ఏయే యూజర్ల కాంటాక్టులకు పంపాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. గరిష్టంగా 256 కాంటాక్టుల వరకు మాత్రమే ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంది. 256 కాంటాక్టులను ఎంచుకున్న తర్వాత బ్రాడ్​ కాస్ట్ విండోను ఓపెన్ చేయాలి. అందుకోసం మీరు ‘Tick’పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్రాడ్ కాస్ట్ విండో సాయంతో ఎంచుకున్న వాట్సాప్​ కాంటాక్ట్‌లకు ఒకేసారి మెసేజ్ ఫార్వర్డ్​ చేసుకోవచ్చు. మీరు పంపే మెసేజ్ ఏదైనా కావొచ్చు.. టెక్స్ట్, వాయిస్ మెసేజ్, ఫొటోలు, వీడియోలు ఇలా ఏ ఫార్మాట్ మెసేజ్ అయినా సింపుల్ గా క్షణాల వ్యవధిలో పంపుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఓసారి ట్రై చేసి చూడండి.

Read Also : WhatsApp New Feature : పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెట్టారా? క్షణాల్లో డిలీట్ చేయొచ్చు!