Bathukamma 2023 : పూల సంబురంలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ప్రత్యేకతలు

తొమ్మిది రోజులు గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ బతుకమ్మ పండుగను జరుపుకునే ఆడబిడ్డలు మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా జరుపుకుంటారు.

muddapappu Bathukamma celebrations

Bathukamma 2023 :  తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని చాటా చెప్పే ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు మూడో రోజు కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలంతా ముద్దపప్పు బుతకమ్మను జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ ఆటలు ఆడిన మహిళలు, అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా జరుపుకుంటారు.

తొమ్మిది రోజులలో గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ బతుకమ్మ పండుగను జరుపుకునే ఆడబిడ్డలు ముద్దపప్పు బతుకమ్మ రోజున ప్రసాదంగా ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదం తయారు చేసి సమర్పిస్తారు. అందుకే మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ అనే పేరు వచ్చింది.

Bathukamma 2023: బృహదీశ్వరాలయానికి బతుకమ్మకు సంబంధమేంటి..?

బతుకమ్మను ఏ పేరుతో పిలుచుకుని పూజించినా..ఏ నైవేద్యాలు సమర్పించినా ఈ పండుగలో ప్రధాన పాత్ర పూలదే కావటం విశేషం. ప్రతిరోజు బతుకమ్మను పేర్చేందుకు తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీత జడలు వంటి రకరకాల పూలతో బతుకమ్మని పేర్చి తొమ్మిది రోజుల సంబరాన్ని మహిళలు ఘనంగా జరుపుకుంటారు. ఆడపడుచుల ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజిస్తూ బతుకమ్మను గంగమ్మలో నిమజ్జనం చేస్తారు.