Nipah Virus Antibodies: : మహాబలేశ్వర్ గుహలోని గబ్బిలాల్లో నిఫా వైరస్ యాంటీబాడీలు.. మరో మహమ్మారి తప్పదా?

కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి మరో మహమ్మారితో ముప్పు పొంచి ఉందా? గబ్బిలాల నుంచి కరోనా నుంచి వచ్చిందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ, ఇప్పుడు నిఫా వైరస్ యాంటీబాడీలు గబ్బిలాల్లో ఉన్నాయంటూ ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.

Mahabaleshwar Cave Bats : కరోనాతో వణికిపోతున్న ప్రపంచానికి మరో మహమ్మారితో ముప్పు పొంచి ఉందా? గబ్బిలాల నుంచి కరోనా నుంచి వచ్చిందనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ, ఇప్పుడు నిఫా వైరస్ యాంటీబాడీలు గబ్బిలాల్లో ఉన్నాయంటూ ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధిగాంచిన మహాబలేశ్వర్ గుహలోని కొన్ని గబ్బిలాలపై పరిశోధన జరిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించిన టాప్ -10 గ్లోబల్ ప్రియారిటీ లిస్ట్ పాథోజెన్‌లలో ఒకటైన నిపా వైరస్ (NiV) ప్రాబల్యాన్ని అధ్యయనం చేసేందుకు ఇండియాలో గబ్బిలాలపై ఈ సర్వేను నిర్వహించారు.

మార్చి 2020లో రెండు జాతుల గబ్బిలాలపై అధ్యయనం చేసేందుకు మహాబలేశ్వర్ గుహలోని (Rousettus leschenaultii, Pipistrellus pipistrellus) గబ్బిలాలను వలల ద్వారా పరిశోధకులు పట్టుకున్నారు. ఈ రెండు జాతుల్లో నుంచి నిఫా వైరస్ వ్యాప్తి చెందడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేదానిపై పరిశోధకులు దృష్టిసారించారు. దీనికి సంబంధించి ఫలితాలను పబ్లిక్ హెల్త్, జనరల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో పబ్లిష్ చేశారు. ఈ ఫలితాల్లో వేర్వేరు గబ్బిలాల జాతుల్లో నిఫా వైరస్ (NiV) యాంటీబాడీలు ఉన్నాయని గుర్తించారు. ఐసీఎంఆర్, NIV కంటైన్మెంట్ జోన్లలో (Necropsy) ద్వారా పరిశోధనలు జరిపారు.

గొంతులోని స్వాబ్, రెక్టాల్ స్వాబ్, ఆర్గాన్ శాంపిల్స్ (కిడ్నీ, లివర్, క్లోమము) నమూనాలను సేకరించి అందులో RNAను వేరుచేశారు. వాస్తవానికి నిఫా వైరస్ అనేది.. జూనటిక్ వైరస్ గా పిలుస్తారు.. అంటే.. జంతువులు, మనుషుల మధ్య ఈ వైరస్ వ్యాపించగలదు. 2018లో నిఫా వైరస్.. 19 మందిలో 17 మంది బారిన పడ్డారు. 89శాతం మరణాల రేటు నమోదైంది. నిపా వైరస్ పండ్ల గబ్బిలాల స్టెరోపోడిడే కుటుంబంలో నివసిస్తుంది. పండ్ల బ్యాట్ వదిలే వ్యర్థాల ద్వారా కలుషితమైన ఆహారాన్ని తినడం లేదా తాగడం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.

పొదిగే కాలం (ఇంక్యూబిషన్ పిరియడ్) :
నిఫా వైరస్.. సగటున 5-14 రోజులు ఉంటుంది. కానీ కొన్ని తీవ్రమైన సందర్భాల్లో 45 రోజుల వరకు ఉంటుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి తెలియకుండానే ఇతరులకు సోకుతుంది. అందుకు చాలా సమయం పడుతుంది.

లక్షణాలు:
ఈ వైరస్ తీవ్రమైన శ్వాసకోశ వ్యాప్తికి కారణమవుతుంది. కోమా లేదా మరణానికి దారితీసే ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు)కు దారితీస్తుంది. జ్వరం, తలనొప్పి, మయాల్జియా (కండరాల నొప్పి), వాంతులు, గొంతు నొప్పి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత మైకము, మగత, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎలా నివారించవచ్చు?
వైరస్ ప్రాంతాల్లో జబ్బుపడిన పందులు, గబ్బిలాలకు గురికాకుండా నివారించాల్సి ఉంటుంది. సోకిన బ్యాట్ ద్వారా కలుషితమైన ఖర్జూర రసం తాగడం ద్వారా నిపా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. నిఫా వ్యాప్తి సమయంలో, ప్రామాణిక ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో వైరస్ బాధిత వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించకుండా నిరోధించే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు