Monsoon (1)
Rainy Season : చలికాలంలో సాధారణంగా వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. అయితే వర్షకాలంలో వాతావరణం అలా ఉండదు. వర్షం పడుతున్నంత సేపు వాతావరణం చల్లగా ఉంటుంది. వర్షంపోయాక తిరిగి వేడి వాతావరణం వస్తుంది. వాతావరణంలో చోటు చేసుకుని తాత్కాలికమైన మార్పుల కారణంగా శరీరం అందుకు అనుగుణంగా సర్ధుబాటు చేసుకోవటం కష్టంగా మారుతుంది. ఈ సందర్భంలో సీజనల్ జబ్బులు చుట్టుముడతాయి. అయితే కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే వీటి నుండి సులభంగానే బయటపడవచ్చు. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఆ చిన్న సమస్యలు ప్రాణాల మీదకు తీసుకువస్తాయి.
వానాకాలంలో చల్లగాలి కారణంగా ముక్కు మొదలు, శ్వాసకోశాల్లోని రక్తనాళాల వరకు సంకోచిస్తాయి. ఈ సమయంలో గాలి పీల్చటం కష్టంగా మారుతుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తాయి. సైనసైటికస్, రైనైటిస్, ఎడినైటిస్, వంటివి వస్తాయి. చల్లగాలి పీల్చటం వల్ల గొంతు సమస్య వస్తుంది. గొంతులోని టాన్సిల్స్ వాపు వచ్చి నొప్పి ఉంటుంది. శ్వాస వ్యవస్ధలోకి సూక్ష్మ క్రిములు ప్రవేశిస్తాయి. ఆస్తమా సమస్య ఉన్నవారికి ఈ పరిస్ధితి మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. వాతావరణంలో తరచు చోటు చేసుకునే ఈ మార్పులు లంగ్స్ లో కఫం పేరుకునేలా చేస్తాయి. గొంతులు, ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కలిగిస్తాయి.
చల్లని వాతావరణం ఉన్న సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం చల్లని వాతావరణంలో రక్తనాళాలు సంకోచిస్తాయి. శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్ధ సైతం పనితీరు పెరగటం వల్ల ఆకలి అధికంగా ఉంటుంది. ఆకలి వల్ల అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటుంటారు. మోతాదు మించి తీసుకోవటం వల్ల అరుగుదల సమస్య ఏర్పడుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగుల్లోకి చేరుతుంది. దీంతో తిన్నది జీర్ణం కాక వాంతులు, విరేచనాలు అవుతాయి. గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చల్లని వాతావరణం ఉన్న సందర్భంలో తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి.
చల్లని వాతావరణం ఉన్న సమయాల్లో ఎక్కువగా బయటి వాతావరణంలో తిరగకుండా ఉండాలి. చల్లని గాలి తగలకుండా ముఖానికి మాస్క్ ధరించాలి. రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టుకోవాలి. గొంతునొప్పి సమస్యతో బాధపడేవారు గోరు వెచ్చని నీటిని తాగటం మంచిది.