Strength and Stamina for Men
Strength And Stamina For Men : భారతీయ వంటకాలు రుచికరంగా ఉండటంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధిగాంచాయి. 50 ఏళ్లు పైబడిన పురుషులు బలం, శక్తిని పెంచుకోవటానికి అనేక భారతీయ ఆహారాలు సహాయపడతాయి. అలాంటి వాటిలో పసుపు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
READ ALSO : Lower Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే రోజువారీ పానీయాలు ఇవే ?
అనేక భారతీయ వంటకాల్లో ప్రోటీన్ , ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను పెంచడానికి , శరీరానికి బలాన్ని అందించటానికి సహాయపడతాయి. ఈ భారతీయ ఆహారాలను క్రమపద్ధతిలో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన పురుషులు ఇలాంటి ఆహారాలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
50 ఏళ్లు పైబడిన పురుషులు తీసుకోవాల్సిన ఉత్తమ భారతీయ ఆహారాలు ;
1. పప్పు ; పప్పు చాలా మంది ఫేవర్ ఆహారం. ఇష్టంగా తింటారు. పప్పులో మాంసకృత్తులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి, శక్తిని అందించటానికి తోడ్పడుతుంది. ఇది విటమిన్లు , మినరల్స్‌తో నిండి ఉండటం వల్ల 50 ఏళ్లు పైబడిన పురుషులకు అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు. పురుషుల వయస్సుతోపాటు వారి శరీరం సహజంగా కండర ద్రవ్యరాశిని కోల్పోతుంది. పప్పు తినడం వల్ల ఈ ప్రక్రియను ఎదుర్కోవడానికి దోహదపడుతుంది. పప్పులో ఉండే అధిక ఐరన్ కంటెంట్ వృద్ధులలో రక్తహీనతను నివారిస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
2. రైతా ; రైతా అనేది ప్రోబయోటిక్స్ , యాంటీఆక్సిడెంట్లతో నిండిన పెరుగు ఆధారిత ఆహారం. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఎముకలకు ప్రోటీన్, కాల్షియం యొక్క మూలాన్ని అందించి బలంగా మారుస్తుంది. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో తోడ్పడతాయి.
3. చపాతీ ; చపాతీ అనేది గోధుమ పిండితో తయారు చేసే సాంప్రదాయ వంటకం. ఇది శరీర శక్తి ఉత్పత్తికి అవసరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఫైబర్ యొక్క మంచి మూలం. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
READ ALSO : Reduce Belly Fat : 40 ఏళ్లకు పైబడిన మహిళలు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవటానికి దోహదపడే ఆహారాలు !
4. మసాలా దినుసులు, కూరగాయలు ; మితమైన మసాలా దినుసులను కూరగాయలతో కలిపి వినియోగించటం వల్ల మంచి మేలు జరుగుతుంది. వీటి ద్వారా వివిధ రకాల పోషకాలను పొందవచ్చు. పసుపు , వెల్లుల్లి వంటి మసాలా దినుసులు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వివిధ రకాల కూరగాయల కలయిక, మసాలా దినుసుల యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సహాయపడతాయి.
5. చనా మసాలా ; చనా మసాలా ప్రోటీన్ , ఫైబర్ యొక్క అద్భుతమైన మూలంగా చెప్పవచ్చు. విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి. 50 ఏళ్లు పైబడిన పురుషులకు దీనిని తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చనా మసాల తయారు చేసే సమయంలో తక్కువ నూనె, ఉప్పును ఉపయోగించాలి.
READ ALSO : Reduce Anxiety : ఆందోళనను తగ్గించడంలో సహాయపడే 10 అద్భుతమైన ఆహారాలు !
ఈ భారతీయ వంటకాలు 50 ఏళ్లు పైబడిన పురుషులు బలంగా, శక్తి పెంచుకునేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. పప్పు మొదలు చపాతీ వరకు, ఈ ఆరోగ్యకరమైన భారతీయ ఆహారాలు ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అనేక రకాల పోషకాలను మన శరీరానికి అందిస్తాయి.