Sugar Free Sweeteners : బరువు తగ్గడానికి చక్కెర లేని స్వీటెనర్లను ఉపయోగించకూడదా ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ?

వాస్తవానికి నాన్-షుగర్ స్వీటెనర్లను (NSS) వినియోగించటం వల్ల టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు కలిగించి పెద్దలలో మరణాల ప్రమాదాన్ని పెంచుతున్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు. డైట్ కోక్‌ వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెరకు బదులుగా దీర్ఘకాలిక బరువు నియంత్రణలో నాన్ షుగర్ స్వీటెనర్లను ఉపయోగించటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

Sugar Free Sweeteners : బరువు తగ్గడానికి చక్కెర లేని స్వీటెనర్లను ఉపయోగించకూడదా ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ?

artificial sweeteners

Sugar Free Sweeteners : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొత్త నివేదిక ప్రకారం బరువు పెరగటం, స్థూలకాయాన్ని నిరోధించడంలో సహాయపడే విషయంలో సింథటిక్ స్వీటెనర్లు చక్కెరకు భిన్నమేమి కాదని నిర్ధారణ అయింది. చాలా మంది బరువు తగ్గాలన్న ఆలోచనతోపాటు, కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి నాన్-షుగర్ స్వీటెనర్లను (NSS) ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు ఇకపై వాటిని ఉపయోగించకుండా ఉండటమే మేలు. ఈ విషయాన్ని చెబుతుంది ఎవరో కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కృత్రిమ స్వీటెనర్‌ల గురించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

READ ALSO : Weight Loss : బరువు తగ్గే ప్రక్రియలో కేలరీలే ఎందుకు కీలకం !

వాస్తవానికి నాన్-షుగర్ స్వీటెనర్లను (NSS) వినియోగించటం వల్ల టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు కలిగించి పెద్దలలో మరణాల ప్రమాదాన్ని పెంచుతున్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు. డైట్ కోక్‌ వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెరకు బదులుగా దీర్ఘకాలిక బరువు నియంత్రణలో నాన్ షుగర్ స్వీటెనర్లను ఉపయోగించటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

READ ALSO : Weight Loss And Fat Loss : బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం మధ్య వ్యత్యాసం తెలుసా? ఆరోగ్యకరమైన శరీరం కోసం ఏంచేయాలంటే?

సహజంగా లభించే చక్కెరలతో ఆహారం తీసుకోవడం వంటి మార్గాలను అనుసరించటం మంచిదని సూచిస్తున్నారు. నాన్-షుగర్ స్వీటెనర్లను (NSS) ముఖ్యమైన ఆహార కారకాలు కావు. వీటిలో పోషక విలువలు ఉండవు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ఆహారంలోని తీపిని పూర్తిగా తగ్గించుకోవటం మంచిది.

READ ALSO : Musk Melon : బరువు తగ్గడానికి వేసవిలో కర్బూజా తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనమంటే ?

నాన్-షుగర్ స్వీటెనర్లను (NSS)అనేది కేలరీలు లేని, తక్కువ కేలరీల కృత్రిమ స్వీటెనర్లు. ఇవి చక్కెరలకు ప్రత్యామ్నాయంగా రూపొందించబడ్డాయి. ఈ చక్కెరలను ప్యాక్ చేసిన ఆహారాలు,పానీయాలలో పదార్థాల్లో ఉపయోగిస్తారు. అదే క్రమంలో మరోవైపు చూస్తే NSS కృత్రిమంగా ఉత్పన్నమైన, రసాయనికంగా సవరించబడని సహజ పదార్ధాలను కలిగి ఉంటుంది. కేలరీలు లేకుండా తీపి రుచిని అందించటం వల్ల అధిక బరువు, స్థూలకాయాన్ని నివారించడానికి అవి సహాయపడతాయని మరి కొందరు వాదిస్తున్నారు.

READ ALSO : Fenugreek Water : కొవ్వును కరిగించటంతోపాటు, బరువు తగ్గించే మెంతుల నీరు! ఎలా తయారు చేసుకోవాలంటే ?

కీటో డైట్‌లలో ప్రసిద్ధి చెందిన ఎరిథ్రిటాల్ అనే స్వీటెనర్ వల్ల స్ట్రోక్‌లు, గుండెపోటులు, రక్తం గడ్డకట్టడం , చివరకు మరణానికి దారితీస్తుందని ఏడాది క్రితం ఒక అధ్యయనం ద్వారా కనుగొన్నారు. WHO ప్రకారం బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలినికి స్వీటెనర్లను ఉపయోగించే వ్యక్తులు ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది.