Reduce Anxiety : ఆందోళనను తగ్గించడంలో సహాయపడే 10 అద్భుతమైన ఆహారాలు !
ప్రాసెస్ చేసిన మాంసాలు, అధిక చక్కెర ఆహారాలు, టీ మరియు కాఫీ కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆందోళన లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. మరోవైపు ఆందోళన స్థాయిలను తగ్గించడానికి కొన్నిరకాల ఆహారాలు తోడ్పడతాయి.

Reduce Anxiety
Reduce Anxiety : ఒత్తిడి, ఆందోళన సమయాల్లో చాలా మంది ఉప్పగా ఉండే స్నాక్స్ , పంచదారతో కూడిన ఆహారపదార్ధాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇది మెదడు యొక్క ఆనంద కేంద్రాలను సక్రియం చేస్తుంది. ఈ పదార్ధాలు తీసుకున్నప్పుడు మనకు మంచి అనుభూతిని కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో, ఈ అధిక కొవ్వు ఆహారాలు మంచి కంటే ఆరోగ్యానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. నిరాశ , ఆందోళనకు గురి చేస్తాయి.
ప్రాసెస్ చేసిన మాంసాలు, అధిక చక్కెర ఆహారాలు, టీ మరియు కాఫీ కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతాయి. ఆందోళన లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. మరోవైపు ఆందోళన స్థాయిలను తగ్గించడానికి కొన్నిరకాల ఆహారాలు తోడ్పడతాయి. వాటిలో జీడిపప్పు, బెర్రీలు, నారింజ, డార్క్ చాక్లెట్, పసుపు వంటివి ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని సూపర్‌ఫుడ్‌లు.
కొన్ని పదార్ధాలు భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని ఆహారాలు ఆందోళన కలిగించేవిధంగా ఉండగా, మరికొన్ని మానసిక ఉపశమనానికి సహాయపడతాయి. ఆహారాన్ని ఔషధంగా ఉపయోగించడం అనేది ఆందోళనల నుండి రక్షణలో మొదటి వరుసలో నిలుస్తుంది. కొన్ని ఆహారాలు ఆందోళనను తగ్గించటంలో సహాయపడతాయి, అయితే అవే సమస్యకు సరైన చికిత్సగా భావించటం సరైందికాదని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO : Plants cry when stressed : ఒత్తిడి ఎక్కువైతే మనుష్యులే కాదు.. మొక్కలు కూడా ఏడుస్తాయట..మీరు విన్నది నిజమే
ఆందోళనను తగ్గించే ఆహారాలు ;
1. జీడిపప్పు అధిక మెగ్నీషియం కంటెంట్ కారణంగా విశ్రాంతి, ప్రశాంతతను చేకూర్చటంలో సహాయపడుతుంది.
2. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి ఆందోళనను మరింత తీవ్రతరం చేసే ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరం , మెదడును రక్షిస్తాయి.
3. బ్రస్సెల్స్ మొలకలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంథులకు మద్దతు ఇస్తుంది.
4. సాల్మన్లో కనిపించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
5. పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది యాంటి యాంగ్జయిటీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది.
READ ALSO : Psychological Stress : పిల్లలపై ప్రభావం చూపే మానసిక ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
6. ఊరగాయలలోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి, ఇది మెరుగైన మానసిక స్థితికి తోడ్పడుతుంది.
7. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, B విటమిన్లు ఉంటాయి, ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.
8. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ మూడ్-బూస్టింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.
9. లిథినైన్ ఇది గ్రీన్ టీలో ఉండే ఒక అమైనో ఆమ్లం, విశ్రాంతిని, నిద్రను మెరుగుపరుస్తుంది.
10. స్విస్ చార్డ్ మెగ్నీషియం, పొటాషియం యొక్క మంచి మూలం, ఈ రెండూ శరీరంపై ప్రశాంతమైన ప్రభావాలను చూపుతాయి.