Keshav Maharaj : చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్.. సపారీ క్రికెటర్లలో ఒకే ఒక్కడు..
దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (Keshav Maharaj) అరుదైన ఘనత సాధించాడు.

Keshav Maharaj become first South African spinner to get 300 wickets in international cricket
Keshav Maharaj : దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (Keshav Maharaj) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరుపున 300 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో వికెట్ తీసిన తరువాత అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో షాన్ పొలాక్ 823 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత డేల్ స్టెయిన్, మఖాయ ఎంతినిలు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు..
* షాన్ పొలాక్ – 414 మ్యాచ్‌ల్లో 823 వికెట్లు
* డేల్ స్టెయిన్ – 263 మ్యాచ్‌ల్లో 697 వికెట్లు
* మఖాయా ఎంతిని – 283 మ్యాచ్‌ల్లో 661 వికెట్లు
* అలాన్ డొనాల్డ్ – 236 మ్యాచ్‌ల్లో 602 వికెట్లు
* కగిసో రబాడ – 245 మ్యాచ్‌ల్లో 580 వికెట్లు
* జాక్వెస్ కలిస్ – 513 మ్యాచ్‌ల్లో 572 వికెట్లు
* మోర్నీ మోర్కెల్ – 241 మ్యాచ్‌ల్లో 535 వికెట్లు
* కేశవ్ మహారాజ్ – 147 మ్యాచ్‌ల్లో 304 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో మార్‌క్రమ్ (82), బవుమా (65), మాథ్యూ బ్రీట్జ్కే (57) అర్థశతకాలు సాధించారు. ఆసీస్ బౌలర్లలో ట్రావిస్ హెడ్ నాలుగు వికెట్లు తీశాడు. బెన్ ద్వార్షుయిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపా ఓ వికెట్ సాధించాడు.
Kris Srikkanth : ఈ జట్టుతో ఆసియాకప్ గెలుస్తారేమో గానీ.. సెలక్టర్లను ఉతికి ఆరేసిన క్రిస్..
అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (88) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లో కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీశాడు. నాంద్రే బర్గర్, లుంగి ఎంగిడి చెరో రెండు వికెట్లు తీశారు. ప్రేనేలన్ సుబ్రాయెన్ ఓ వికెట్ సాధించాడు.