6 Best Android Phones : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో కన్నా బెటర్ ఫీచర్లతో 6 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
6 Best Android Phones : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో కన్నా అద్భుతమైన ఫీచర్లతో 6 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

6 Best Android Phones
6 Best Android Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 2025లో మార్కెట్లో అనేక బ్రాండ్ల బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పవర్‌ఫుల్ (6 Best Android Phones) స్పెషిఫికేషన్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో కన్నా ఆకర్షణీయమైన ఫీచర్లతో పొందవచ్చు.
మీరు కూడా ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ఫాస్ట్ పర్ఫార్మెన్స్, క్వాలిటీ కెమెరాలు, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో ఆరు బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
వివో X200 ప్రో (రూ. 94,999) :
వివో X200 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 50MP+200MP+50MP ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ షూటర్, 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
షావోమీ 15 అల్ట్రా (రూ. 1,09,999) :
షావోమీ 15 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 6.73-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌కు పవర్ అందిస్తుంది. 90W టర్బో ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5410mAh బ్యాటరీని అందిస్తుంది. బ్యాక్ సైడ్ 50MP+200MP+50MP+50MP కెమెరా సెటప్, 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.
Read Also : Samsung Galaxy A35 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL (రూ. 99,999) :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 120Hzతో 6.8-అంగుళాల LTPO OLED ప్యానెల్ ఉంది. గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్‌ను అందిస్తుంది. మొబైల్ యూనిట్ ట్రిపుల్ 50MP+48MP+48MP రియర్ లెన్స్ సెటప్, 50MP ఫ్రంట్ కెమెరా, 37W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5060mAh బ్యాటరీ కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్రోను మించి ఫీచర్లను అందిస్తుంది.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా (రూ. 89,998) :
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 7.0-అంగుళాల ఫోల్డబుల్ LTPO అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. డ్యూయల్ 50MP + 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, 68W ఛార్జింగ్ ద్వారా సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఐఫోన్ 16 ప్రో కన్నా బెస్ట్ అని చెప్పొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ (రూ. 99,999) :
శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.7-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది. ట్రిపుల్ 50MP+10MP+12MP బ్యాక్ కెమెరా సెటప్, 12MP సెల్ఫీ కెమెరా, 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4900mAh బ్యాటరీతో వస్తుంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 99,999) :
ఒప్పో ఫైండ్ X8 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ 50MP మెయిన్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా, 80W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో 5910mAh బ్యాటరీ ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో కన్నా బెటర్ ఫీచర్లను కలిగి ఉంది.