Highest FD Rates : 3ఏళ్ల FDపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే బ్యాంకులివే.. ఏయే బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందంటే? ఫుల్ లిస్ట్..
Highest FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ అందించే బ్యాంకుల్లో ఐసీఐసీఐ, యాక్సెస్, పీఎన్‌బీ, ఎస్బీఐ ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

Highest FD Rates
Highest FD Rates : ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలామంది పెట్టుబడి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంపిక (Highest FD Rates) చేసుకుంటారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కచ్చితంగా ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉంటుంది.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ నుంచి ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ వరకు పెట్టుబడి కోసం అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, బ్యాంక్ FDలో గ్యారెంటెడ్ రాబడి లభిస్తుంది. 3 ఏళ్ల ఎఫ్‌డీలో అత్యధిక రాబడిని అందిస్తున్న పెద్ద బ్యాంకులు ఉన్నాయి. ఈ జాబితాలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అత్యధిక రాబడినిచ్చే బ్యాంకులివే :
- యాక్సిస్ బ్యాంక్ : 6.60 శాతం
- ఐసిఐసిఐ బ్యాంక్ : 6.60 శాతం
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 6.60 శాతం
- బ్యాంక్ ఆఫ్ బరోడా : 6.50 శాతం
- HDFC బ్యాంక్ లిమిటెడ్ : 6.45 శాతం
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 6.40 శాతం
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 6.30 శాతం
- కెనరా బ్యాంకు : 6.25 శాతం
- భారత బ్యాంకు : 6.25 శాతం
ఈ జాబితా ప్రకారం.. ప్రభుత్వ బ్యాంకులలో యాక్సిస్ బ్యాంక్ 3 ఏళ్ల ఎఫ్‌డీపై అత్యధిక రాబడిని ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఏకంగా 6.50 శాతం రాబడిని అందిస్తోంది. ప్రైవేట్ బ్యాంకులలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక రాబడిని ఇస్తోంది. 3 ఏళ్ల ఎఫ్‌డీపై 6.50శాతం రాబడిని కూడా అందిస్తోంది.
ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకులు 3 ఏళ్ల ఎఫ్‌డీపై 6.60శాతం, HDFC ఎఫ్‌డీపై 6.45 శాతం అందిస్తున్నాయి. అదేవిధంగా, ఎస్బీఐ వంటి పెద్ద ప్రభుత్వ బ్యాంకులు 6.30శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.40 శాతంగా అందిస్తున్నాయి.
ఎఫ్‌డీలో డబ్బు రెట్టింపు ఎలా? :
ఏదైనా పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లో డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందనేది రాబడి లేదా వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఫార్ములాను 72/ రిటర్న్ = సంవత్సరాలు (డబ్బు రెట్టింపు) తప్పక పాటించాలి. ఈ విధంగా డిపాజిట్ చేసిన డబ్బు రెట్టింపు అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో ఫార్ములా ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.