The Hundred 2025 : వామ్మో.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు..
ది హండ్రెట్ లీగ్(The Hundred)లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్. మాంచెస్టర్ ఒరిజినల్స్ కు

The Hundred 2025 Phil Salt took a surprising catch of max holden
The Hundred 2025 : ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ ఒకడు. మైదానంలో అతడు చేసే విన్యాసాలు ప్రత్యేకంగా చూడాల్సిందే. బంతి అతడి దరిదాపుల్లోకి వెళ్లిందా సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ చక్కటి క్యాచ్‌లు అందుకోవాన్ని చూస్తూనే ఉంటాం. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెట్ లీగ్ (The Hundred 2025 )లో అలాంటి ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
ఈ టోర్నీలో మాంచెస్టర్ ఒరిజినల్స్ కు ఫిల్ సాల్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం మాంచెస్టర్ ఒరిజినల్స్, ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. మాంచెస్టర్ బ్యాటర్లలో లూయిస్ గ్రెగొరీ (21 బంతుల్లో 33 పరుగులు నాటౌట్) రాణించాడు. ఫిల్‌సాల్ట్ (20 బంతుల్లో 19 పరుగులు) విఫలం అయ్యాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు తీశాడు.
Keshav Maharaj : చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్.. సపారీ క్రికెటర్లలో ఒకే ఒక్కడు..
అనంతరం లక్ష్యాన్ని ట్రెంట్ రాకెట్స్ 74 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ట్రెంట్ రాకెట్స్ బ్యాటర్లలో రెహాన్ అహ్మద్ (35 బంతుల్లో 45 నాటౌట్ ), టామ్ మూర్స్ (13 బంతుల్లో 22 నాటౌట్) లు రాణించారు.
ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్..
ట్రెంట్స్ ఇన్నింగ్స్ లో 48వ బంతిని జోష్ టంగ్ వేశాడు. ట్రెంట్ బ్యాటర్ మాక్స్ హోల్టెన్ మిడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫిల్ సాల్ట్ అమాంతం డైవ్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫిల్ సాల్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన సంగతి తెలిసిందే. ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
THAT’S AN ABSOLUTE STUNNER BY PHIL SALT – ONE OF THE BEST. 🤯pic.twitter.com/ijlumjTqll
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2025