Covaxin Phase 2-3 Trials : భారత్ బయోటెక్ కోవాగ్జిన్ : 2ఏళ్ల నుంచి 18ఏళ్ల పిల్లల్లో క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

కోవాగ్జిన్ టీకా విషయంలో ప్రముఖ ఫార్మా కంపెనీ దిగ్గజం భారత్ బయోటెక్ ముందడగు వేసింది. రెండేళ్ల వయస్సు నుంచి 18ఏళ్ల వయస్సు ఉన్నవారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందింది.

Covaxin Phase 2-3 Trials : కోవాగ్జిన్ టీకా విషయంలో ప్రముఖ ఫార్మా కంపెనీ దిగ్గజం భారత్ బయోటెక్ ముందడగు వేసింది. రెండేళ్ల వయస్సు నుంచి 18ఏళ్ల వయస్సు ఉన్నవారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందింది. 2-18 వయస్సు వారిలో క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ నిపుణుల కమిటిని విజ్ఞప్తి చేసింది. భారత్ బయోటెక్ అభ్యర్థనను నిపుణుల కమిటీ పరిశీలించింది.

ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు నిపుణుల కమిటీ అనుమతినిచ్చింది. ఈ ట్రయల్స్ 2 నుంచి 18ఏళ్ల వయస్సు ఉన్న 525 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ఢిల్లీ, పాట్నా ఎయిమ్స్, నాగ్ పూర్ మెడిట్రినాలో క్లినికల్ ట్రయల్స్ జరుగనున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) లోని COVID-19 పై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) మంగళవారం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ దరఖాస్తును పరిశీలించింది.

2 నుండి 18 ఏళ్ల వయస్సు పిల్లల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రతిపాదిత దశ II / III క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి కమిటీ సిఫార్సు చేసింది. గతంలో ఫిబ్రవరి 24 నాటి SEC సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై చర్చించింది. సవరించిన క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్‌ను సమర్పించాలని సంస్థను కోరింది.

ట్రెండింగ్ వార్తలు