Black coffee keeps blood glucose levels under control! Is it healthy for diabetics?
Black Coffee : కాఫీ తాగడం అంత మంచిది కాదని వాదించే వారు కొందరైతే , కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిదని చెప్పే వారు మరి కొందరు. వీరి వాదన ఎలాగున్నా కాఫీ కన్నా, బ్లాక్ కాఫీ తాగటం మంచిదన్న విషయం అధ్యయనాల ద్వారా తేలింది. అలా కాదు. సాధారణ కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. బ్లాక్ కాఫీలో యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ బీ2, బీ3, బీ5, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
రోజుకు 2 కప్పుల బ్లాక్ కాఫీ తాగితే లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతోపాటు, లివర్ సిర్రోసిస్ తగ్గుతుందని కూడా అంటున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడడం, మెదడు యాక్టివ్ గా పనిచేయడం, మెటబాలిజం శాతం పెరిగి కొలెస్ట్రాల్ తగ్గటం ద్వారా అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు.
శరీరాన్ని విష వ్యర్థాల నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాఫీలో ఉండే శక్తివంతమైన కెమికల్ కాంపౌండ్లు వ్యాధులు రాకుండా కాపాడతాయి. కాఫీ గింజలతో తయారుచేసిన ఓ కప్పు బ్లాక్‌కాఫీలో 2 కేలరీలు మాత్రమే ఉంటాయి. బ్లాక్‌కాఫీ శరీరంలో అవసరం లేని నీటిని బయటకు పంపేస్తుంది. తరచూ యూరిన్‌కి వెళ్లడం వల్ల బాడీలో అదనపు బరువు తగ్గుతుంది. శారీరకంగా, మానసికంగా యాక్టివ్‌గా ఉండేందుకు ఉపకరిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు మీలో కనిపించకుండా చేస్తుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ వారికి బ్లాక్ కాఫీ సంజీవనిలాంటిదిగా చెప్పవచ్చు. బ్లాక్ కాఫీ తాగితే మానసిక ఒత్తిడి, అలసటను జయించి రోజంతా ఉత్సాహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్లాక్ కాఫీని రోజులో రెండు కప్పులు మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే మాత్రం అనర్ధాలు తప్పవు.