Blood Pressure : గర్భధారణ సమయంలో రక్తపోటు సమస్య!

కొంతమంది గర్భిణీల్లో రక్తపోటు సమస్యలు గర్భధారణ సమయంలో కనిపించకపోయినా, గర్భదారణ తరువాత రక్తపోటు సమస్య వస్తుంది. ముఖ్యంగా 40ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.

Blood Pressure : గర్భధారణ సమయం లో తల్లీ బిద్దలిద్దరకీ హానికలిగిస్తుంది. గర్భధారణకు ముందు చాలా మందిలో ఈ సమస్యను గుర్తించవచ్చు. సాధారణంగా గర్భం దాల్చిన 20 వారాల తర్వాత లేదా డెలివరీకి దగ్గరగా ఉన్నప్పుడు ఇది నిర్ధారణ అవుతుంది. ప్రసవించిన తర్వాత గర్భధారణ రక్తపోటు సాధారణంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ, గర్భధారణ రక్తపోటు ఉన్న కొందరు స్త్రీలు భవిష్యత్తులో దీర్ఘకాలిక రక్తపోటు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి.

రక్తపోటు కారణంగా బిడ్డకు రక్త సరఫరా సరిగా జరగక గర్భం లో బిడ్డ చనిపోయే ప్రమాదము ఉంటుంది. రక్త సరఫరా సర్గా లేని కారణం గా ఉమ్మనీరు తగ్గిపోయి ప్రాణవాయువు అందక పుట్టిన పిల్లలలో బుద్ధిమాన్దవ్యము , ఫైట్స్ లాంటివి తలెత్తుతాయి. గతంలో సాధారణ రక్తపోటు ఉన్న స్త్రీకి అకస్మాత్తుగా అధిక రక్తపోటు మరియు మూత్రంలో ప్రోటీన్ పోవటం వంటివి చోటు చేసుకుంటాయి. గర్భం దాల్చిన 20 వారాల తర్వాత ఇతర సమస్యలు వచ్చినప్పుడు ప్రీక్లాంప్సియా సంభవిస్తుంది. దీర్ఘకాలిక రక్తపోటు ఉన్న స్త్రీలు సైతం ప్రీఎక్లంప్సియాకు గురవుతారు.

రక్తపోటు ఉన్న కొంతమంది స్త్రీలలో మూర్చ సమస్యలు ఎదురవుతాయి. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. రక్తపోటు యొక్క లక్షణాలలో తగ్గని తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, మచ్చలు కనిపించడం, కంటి చూపులో మార్పులతో సహా దృష్టిలో మార్పులు, కడుపు ఎగువ ప్రాంతంలో నొప్పి, వికారం లేదా వాంతులు,ముఖం లేదా చేతులు వాపు, ఆకస్మిక బరువు పెరుగుట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్ధితుల్లో గర్భాశయం లోని వాతావరణం బిడ్డకు అనుకులించనపుడు వైద్యులు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీసేందుకు నిర్ణయం తీసుకుంటారు. అలా బయటకు తీసిన బిడ్డను ఇంటెన్సివ్ కేర్ , ఇంకుబేటర్ల లో ఉంచుతారు. వీటి ద్వారా నెలతక్కువ బిడ్డలు బ్రతికేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి .

కొంతమంది గర్భిణీల్లో రక్తపోటు సమస్యలు గర్భధారణ సమయంలో కనిపించకపోయినా, గర్భదారణ తరువాత రక్తపోటు సమస్య వస్తుంది. ముఖ్యంగా 40ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో. కొంత మందిలో ప్రసవానంతరం సాధారణంగా డెలివరీ
తర్వాత 48 గంటలలోపు రక్తపోటు నిర్ధారణ చేయబడుతుంది. 6 వారాల తర్వాత కూడా రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భం ధరించిన తరువాత రక్తపోటును నియంత్రించడానికి అవసరమైన పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించుకోవటం మంచిది. వైద్యుల సలహాతో అవసరమైతే మందులు ప్రతిరోజు మందులు తీసుకోండి.ఇంట్లోనే మీ రక్తపోటును ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే ఏమి చేయాలో వైద్యులను సంప్రదించండి. ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి. సూప్, క్యాన్డ్ ఫుడ్స్ వంటి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినవద్దు. అవి మీ రక్తపోటును పెంచుతాయి. ప్రతిరోజూ 30 నిమిషాలు తేలిక పాటి నడక వల్ల బరువును నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించుకోవడంలో రక్తపోటు వంటి సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు