Cold Water : శరీరాన్ని ఉత్తేజ పరిచే చన్నీళ్ల స్నానం!

చల్లని నీటితో స్నానం చేయటం వల్ల మానసిక స్ధితి సక్రమంగా ఉంచుకోవచ్చు. ఒత్తిడి చికిత్సకు చన్నీటి స్నానం ఎంతో మేలు చేస్తుంది. చల్లటి స్నానం చేయడం వల్ల శ్రమతో కూడిన హైపర్థెర్మియా నుండి ఉపశమనం పొందవచ్చు.

Cold Water : చాలా మంది రోజు వారి స్నానంలో చన్నీటితో స్నానం చేసేకంటే వేడి నీటితో స్నానం చేసేందుకు ఎక్కవ ఇష్టపడుతుంటారు. అయితే వేడి నీటికంటే చల్లని నీటితో స్నానం చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చ‌న్నీళ్ల‌తో స్నానం చేసేప్పుడు తొలుత ఇబ్బంది అనిపిస్తుంది. అయితే చల్లనీరు ఒంటిపై పడగానే శరీరం మొత్తం ఉత్తేజితమౌతుంది. అప్పటివరకు మంపుగా ఉన్న బాడీ ఒక్కసారిగా మత్తు వదలిపోయి యాక్టీవ్ గా మారిపోతుంది.

చల్లటి స్నానం చేయడం వల్ల దాని ప్రభావం శరీరంపై పడుతుంది. చల్లటి నీరు శరీరం యొక్క జీవక్రియను కూడా పెంచటంలో తోడ్పడుతుంది. చల్లటి నీరు చైతన్యం, చురుకుదనాన్ని కలిగిస్తాయి. చల్లనీటి స్నానం వల్ల అనారోగ్య సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రోగనిరోధక వ్యవస్ధను పెంచటంలో సైతం ఉపకరిస్తాయి. నాడీ వ్యవస్ధను చైతన్యం చేయటం ద్వారా ఎండార్ఫిన్ ల విడుదలను పెంచుతాయి.

చల్లని నీటితో స్నానం చేయటం వల్ల మానసిక స్ధితి సక్రమంగా ఉంచుకోవచ్చు. ఒత్తిడి చికిత్సకు చన్నీటి స్నానం ఎంతో మేలు చేస్తుంది. చల్లటి స్నానం చేయడం వల్ల శ్రమతో కూడిన హైపర్థెర్మియా నుండి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామం ప్రేరేపిత అధిక శరీర ఉష్ణోగ్రతల ఉపశమనం కోసం చల్లని జల్లులు ఇమ్మర్షన్ థెరపీలాగా పనిచేస్తాయి. అలసట యొక్క భావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నొప్పుల నుండి ఉపశమనం కలిగించటంలో చన్నీతో స్నానం బాగా ఉపకరిస్తుంది. నరాలు మెదడుకు నొప్పి సంకేతాలను ప్రసారం చేసే రేటును తగ్గిస్తుంది.

అయితే గుండెతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు చల్లని నీటితో స్నానం చేసే విషయంలో వైద్యుల సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి వారు చన్నీటి స్నానం చేయటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు