Second Saturday
Second Saturday : సెకండ్ శాటర్ డే హాలీడే ఉంటుంది. అందరూ ఈ హాలీడే ని సరదాగా గడుపుతారు. నెలలో వచ్చే సెకండ్ శాటర్ డే కోసం ఎదురు చూస్తారు సరే.. ఎంతమందికి ఈ రోజు ఎందుకు సెలవు ఇస్తారో తెలుసా..
Bank Holidays : జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?
ఇండియాలో రెండవ శనివారం సెలవుదినంగా ప్రకటించడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 19వ శతాబ్దంలో ఓ బ్రిటీష్ ఆఫీసర్ దగ్గర చాలా నిజాయితీగా పనిచేసే సహాయకుడు ఉండేవాడట. అతను సెలవు దినాల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలవడానికి తన గ్రామానికి వెళ్లేవాడట. అలా కొన్నాళ్లు జరిగింది. ఇక రోజులు పెరిగే కొద్ది అతనికి కూడా బాధ్యతలు పెరిగాయట. అంతే సెలవులు తగ్గిపోయి పని ఎక్కువైందట. అలాంటి పరిస్థితుల్లో కొడుకుని చూడటానికే తల్లిదండ్రులు వచ్చారట. తమ కొడుకుకి సెలవు ఇచ్చి తమతో పంపమని అడగటానికి వారు బ్రిటీష్ అధికారి వద్దకు వెళ్లారట.
Women Employees Holidays : మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏడాదికి ఐదు అదనపు సెలవులు
తన దగ్గర పనిచేసే సహాయకుడికి తల్లిదండ్రులను కలవడానికి కూడా సమయం దొరకట్లేదన్న విషయం అప్పుడు ఆ బ్రిటీష్ అధికారికి తెలిసిందట. తన వద్ద ఎంతో నిబద్ధతగా, నిజాయితీగా పని చేస్తున్న సహాయకుడిని చూసి అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడట. ఇక అప్పటి నుంచి ప్రతి నెల రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించారట. బ్రిటీష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది. అయితే ఈ సంప్రదాయాన్ని భారత ప్రభుత్వం కొన్ని ప్రధానమైన విభాగాల్లో అమలు చేస్తోంది. మొత్తానికి రెండో శనివారం సెలవు ప్రకటన వెనుక ఉన్న కథ మాత్రం ఇదన్నమాట.