Bronchitis : చిన్నారులను వేధిస్తున్న బ్రాంకైటిస్!

బ్రాంకైటీస్ సమస్యతో బాధపడుతున్నవారిలో జ్వరం, చలి, కండరాల నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు వారం నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. ఛాతీనొప్పి, దగ్గు విపరీతంగా ఉంటాయి.

Bronchitis

Bronchitis : వాతావరణంలో అనేక మార్పులు శ్వాసకోశ సమస్యలను తెచ్చిపెడతాయి. వాయునాళాల లోపలి భాగం జిగురు పొరలతో కప్పబడి ఉంటుంది. గాలిలోని దుమ్ముకణాలను వడగొట్ట్టడానికి, హాని కలిగించే పదార్థాల తీవ్రతను తగ్గించడానికి, శ్వాసనాళాల్లో తగినంత తడి ఉండేలా చూడటానికి ఉపకరిస్తుంది. ఈ జిగురు పొరలు కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. దీని వల్ల బ్రాంకైటిస్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కు వైరస్ క్రిములే కారణం. బ్రాంకైటిస్ సమస్య పెద్ద వాళ్ళతో పాటు చిన్నపిల్లలు దీని భారిన పడుతున్నారు. చల్లటి వాతావరణంలో వచ్చే జలుబు, ఫ్లూ జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ మైక్రో బ్యాక్టీరియమ్ నిమోనియా,దుమ్ము, ధూళి, పొగ, కెమికల్స్, సిగరెట్ పొగ వంటివి దీని ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

బ్రాంకైటీస్ సమస్యతో బాధపడుతున్నవారిలో జ్వరం, చలి, కండరాల నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు వారం నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. ఛాతీనొప్పి, దగ్గు విపరీతంగా ఉంటాయి. పిల్లి కూతలు, ఆయాసం,ఎక్కువ సేపు నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రాంకైటిస్ తరచుగా వస్తూ ఉంటే అది దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌గా మారడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గి, ఆస్తమాకు దారి తీస్తుంది.

బ్రాంకైటీస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించటం మేలు. ధూమపానం మానాలి, దుమ్ము, ధూళికి, కాలుష్యానికి దూరంగా ఉండాలి, మంచినిద్ర, ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ఎక్కువ భాగం ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి, రోజువారిగా యోగా, ధ్యానం వంటివి చేయాలి. జలుబు కొద్దిగా ఉన్నప్పుడే, రాను రాను తీవ్రంగా మారే ప్రమాదముందని గుర్తించి వెంటనే జలుబుకు తగిన చికిత్స పొందాలి. చల్లని నీటితో తలస్నానం చేయకూదడు. తలస్నానం చేసిన వెంటనే అరబెట్టుకోవాలి. శీతా కాలంలో ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్‌ తాగినపుడుగొంతు పట్టేసి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తినకపోవటమే మంచిది. ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తినాలి.